దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక మూవీ భారతీయుడు 1996లో రిలీజ్ అయి సెన్సేషనల్ సక్సెస్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం దానికి సీక్వెల్ గా భారతీయుడు 2 రూపొందగా దానిని జులై 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.
ఇప్పటికే పోస్టర్స్, సాంగ్స్ టీజర్, ట్రైలర్ ఇలా అన్నిటితో ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచిన భారతీయుడు 2 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో కమల్ హాసన్ మాట్లాడుతూ, తాను భారతీయుడు 3 మూవీకి పెద్ద ఫ్యాన్ ని అని అన్నారు. శంకర్ తనకు భారతీయుడు 3 గురించి చెప్పినప్పుడు ఆ స్టోరీ, క్యారెక్టర్స్ కి ఫ్యాన్ అయిపోయానన్నారు.
ఇక ఆ మూవీలో తాను సేనాపతికి తండ్రిగా కనిపించనుండగా స్వాతంత్రోద్యమానికి సంబంధించి ఆ మూవీలో భారీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందని, అది ఎంతో అద్భుతంగా వచ్చిందన్నారు. అలానే భారతీయుడు 3 లో తాను కూడా కనిపించనున్నట్లు ఇప్పటికే హీరోయిన్ కాజల్ కూడా తెలిపారు.
భారతీయుడు 2, భారతీయుడు 3 రెండు ప్రాజక్ట్స్ కోసం టీమ్ మొత్తం ఎంతో శ్రమపడిందని, తప్పకుండా ఆ మూవీస్ రెండూ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయనే ఆశాభావం వ్యక్తం చేసారు కమల్. కాగా భారతీయుడు 3 మూవీకి సంబంధించి ఇప్పటికే మేజర్ పార్ట్ షూట్ పూర్తి కాగా మిగతాది కూడా త్వరలో పూర్తి చేసి 2025 ప్రథమార్ధంలో దానిని ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.