లోకనాయకుడు కమల్ హాస ప్రధాన పాత్రలో ప్రముఖ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2 ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక దీనికి కొనసాగింపుగా ప్రస్తుతం భారతీయుడు 3 తెరకెక్కుతోంది.
అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని రెడ్ జెయింట్ మూవీస్ , లైకా ప్రొడక్షన్స్ సంస్థలు పాన్ ఇండియన్ రేంజ్ లో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, ఎస్ జె సూర్య నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. స్వాతంత్రోద్యమానికి సంబందించిన పౌ కీలక సన్నివేశాలు ఈ మూవీలో హైలైట్ గా నిలుస్తాయని సమాచారం.
అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం భారతీయుడు 3 మూవీని డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ కానుందని అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ యొక్క ఓటిటి హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని తమ ఓటిటి లోనే డైరెక్ట్ గా మూవీన్నీ వారు రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. త్వరలో దీనికి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రానుందట.