లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. దీనిని గ్రాండ్ లెవెల్లో రెడ్ జెయింట్ మూవీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించాగా కీలక పాత్రల్లో రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జె సూర్య, సిద్దార్థ నటించారు. అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీ ఇటీవల గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చి డిజాస్టర్ టాక్ ని మూటగట్టుకుంది.
ముఖ్యంగా శంకర్ మార్క్ అంశాలు లేవని, టేకింగ్, మ్యూజిక్, యాక్షన్ సీన్స్ వంటివి ఏమాత్రం ఆకట్టుకోలేదనేది మెజారిటీ ఆడియన్స్ చేసిన విమర్శ. కమల్ అదరగొట్టే పెర్ఫార్మన్స్ కనబరిచినప్పటికీ అది మూవీని కాపాడలేకపోయింది. ఇక ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్ చూసుకుంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 25 కోట్లు గ్రాస్, తమిళనాడులో రూ. 52 కోట్ల గ్రాస్, కర్ణాటక నుండి రూ. 9 కోట్ల గ్రాస్, కేరళ నుండి రూ. 5.75 కోట్ల గ్రాస్, అలానే రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 7 కోట్ల గ్రాస్ కలిపి మొత్తంగా నేషనల్ వైడ్ గా రూ. 99 కోట్ల గ్రాస్ ని దక్కించుకుంది.
అలానే అటు ఓవర్సీస్ లో 6.1 మిలియన్ డాలర్స్ ( రూ. 51 కోట్ల గ్రాస్ ). ఆ విధంగా మొత్తం కలుపుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 150 కోట్లను మాత్రమే దక్కించుకుని ఘోరంగా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. ఒకరకంగా ఈ మూవీ అటు కమల్, ఇటు శంకర్ ఇద్దరి కెరీర్స్ లో భారీ డిజాస్టర్ అని అంటున్నాయి సినీ వర్గాలు. మరి రాబోయే భారతీయుడు 3 ఏమేర విజయం అందుకుంటుందో చూడాలి.