1996లో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ లో నటించిన భారీ పేట్రియాటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ భారతీయుడు. దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. హీరోగా కమల్ కు అలానే దర్శకుడిగా శంకర్ కు భారీ క్రేజ్ తీసుకువచ్చింది ఈ మూవీ. ఇక అప్పటి నుండి ఈ మూవీకి సీక్వెల్ వస్తే బాగుండు అంటూ ఆడియన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూడసాగారు. మొత్తంగా ఇటీవల దానికి సీక్వెల్ అయిన భారతీయుడు 2 ప్రారంభించి ఎట్టకేలకు దానిని నేడు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చారు శంకర్.
కమల్ ప్రధాన పాత్ర చేసిన ఈ మూవీలో సిద్దార్ధ, ఎస్ జె సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ కీలక పాత్రలు చేసారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారతీయుడు 2 కి అనిరుద్ సంగీతం అందించారు. అయితే నేడు ఎన్నో భారీ అంచనాల మధ్య పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ నెగటివ్ టాక్ ని మూటగట్టుకుంది. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇందులో ఎమోషనల్ అంశాలు ఏమాత్రం ఆకట్టుకోలేదని, కమల్ యాక్టింగ్ ఎప్పటివలె బాగున్నప్పటికీ శంకర్ అనేక చోట్ల పేలవమైన టేకింగ్ తో బోర్ కొట్టించారని అంటున్నారు.
ఫస్ట్ 15 నిమిషాలు, ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగున్నా, సెకండ్ హాఫ్ చాలా వరకు సాగతీతగా ఉందని, కొన్ని సీన్స్ అయితే ఎంతో బోరింగ్ గా ఉన్నాయని పలువురు ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. అనిరుద్ బీజీఎమ్ కూడా ఆశించిన స్థాయిలో లేదని, కొన్ని గ్రాండియర్ విజువల్స్ తప్ప మొత్తంగా భారతీయుడు 2 ఆకట్టుకునేలా లేదనేది మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం. ఫస్ట్ డే బాగానే ఓపెనింగ్ రాబట్టిన ఈ మూవీ రాబోయే రోజుల్లో ఎంతమేర కలెక్ట్ చేస్తుందో చూడాలి.