లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ ప్రతిష్టాత్మక మూవీ భారతీయుడు 2. ఈ మూవీని రెడ్ జెయింట్ మూవీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు ఎంతో భారీ స్థాయిలో నిర్మించగా అనిరుద్ సంగీతం అందించారు.
1996 లో వచ్చిన అతి పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ భారతీయుడు కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల ఎన్నో అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే నెగటివ్ టాక్ ని మూటగట్టుకుంది. ఇక తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు సహా అనేక ప్రాంతాల్లో ఈ మూవీ ఏమాత్రం ఆశించిన స్థాయి కలెక్షన్ అందుకోలేకపోయింది. శంకర్ టేకింగ్ బాగున్నప్పటికీ కథ, కథనాల్లో భారీ లోపాలు, ఏమాత్రం ఆకట్టుకొని సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి కూడా దీనికి మైనస్ గా మారాయి.
విషయం ఏమిటంటే, ఈ మూవీ కేవలం రూ. 70 కోట్ల మేర మాత్రమే షేర్ ని రాబట్టి నిర్మాతలకు ఊహించని విధంగా భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. దీనితో త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోన్న దీని సీక్వెల్ అయిన భారతీయుడు 3 పై బిజినెస్ ఎఫెక్ట్ పడింది. కాగా భారతీయుడు 3 తప్పకుండా విజయవంతం అయి ఈ నష్టాలు భర్తీ చేస్తుందని మూవీ టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.