లెజెండరీ యాక్టర్ లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో దిగ్గజ దర్శకడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ భారతీయుడు 2. ఎన్నో ఏళ్ళ క్రితం ఆడియన్స్ ముందుకి వచ్చి భారీ విజయం అందుకున్న భారతీయుడు కి సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ పై ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల పలు భాషల ఆడియన్స్ ముందుకు వచ్చిన భారతీయుడు 2 మూవీ అంచనాలు అందుకోవడంలో పూర్తిగా విఫలమై నెగటివ్ టాక్ ని మూటగట్టుకుంది.
ముఖ్యంగా శంకర్ టేకింగ్ తో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే పై పలువురు ప్రేక్షకాభిమానులు విమర్శలు చేస్తున్నారు. అప్పటి భారతీయుడుతో పోలిస్తే ఇది అసలు శంకర్, కమల్ ల మూవీలానే లేదని అంటున్నారు. ఇక భారతీయుడు 2 మూవీ ఓపెనింగ్స్ పరంగా మొదటి రోజు అన్ని భాషల్లో కూడా బాగానే ఓపెనింగ్ రాబట్టింది. మొదటి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 120 కోట్లమేర గ్రాస్ రాబట్టిన ఈ మూవీ ఓవరాల్ గా రూ. 200 కోట్ల గ్రాస్ లోపే ముగిసే అవకాశం గట్టిగా కనపడుతోందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
అయితే బ్రేకీవెన్ అందుకోవాలంటే భారతీయుడు 2 మూవీ రూ. 500 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. దీనిని బట్టి చూస్తుంటే ఈ మూవీ మొత్తంగా భారీ డిజాస్టర్ గా నిలుస్తుందని తెలుస్తోంది. రెడ్ జెయింట్ మూవీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందించగా కీలక పాత్రల్లో సిద్దార్ధ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సముద్రఖని, ఎస్ జె సూర్య తదితరులు నటించారు.