లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ భారతీయుడు 2. కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సొంతం చేసుకున్న భారతీయుడు మూవీకి సీక్వెల్ గా రూపొందిన ఈమూవీ పై కమల్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో మంచి అంచనాలు ఏర్పరిచిన భారతీయుడు 2 మూవీ సెన్సార్ కార్యకమ్రాలు తాజాగా పూర్తి అయ్యాయి. ఈ మూవీ టోటల్ గా మూడు గంటల నిడివి కలిగి ఉంది, మరియు దీనికి యు / ఏ సర్టిఫికేట్ ని సెన్సార్ బోర్డు కేటాయించింది. అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీని రెడ్ జెయింట్ మూవీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించగా కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జె సూర్య, సిద్దార్థ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇక భారతీయుడు 2 లో కమల్ హాసన్ నటవిశ్వరూపం మరొక్కసారి చూడొచ్చని, అలానే ఆకట్టుకునే కథ, కథనాలతో దర్శకుడు శంకర్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించినట్లు చెప్తున్నారు మేకర్స్. జులై 12న రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.