లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ భారతీయుడు 2. కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయి సంచలన విజయం సొంతం చేసుకున్న భారతీయుడు కి సీక్వెల్ గా రూపొందిన ఈమూవీ పై మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన భారతీయుడు 2 మూవీ ఫస్ట్ డే నుండే నెగటివ్ టాక్ ని మూటగట్టుకుంది. ఇక తాజాగా ఈ మూవీ చాలా చోట్ల నిరాశాజనకంగా కలెక్షన్ అందుకుంటోంది. ఇక భారతీయుడు 2 మూవీ గడచిన 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్ మాత్రమే రాబట్టింది.
కాగా వీటిలో తమిళనాడు నుండి రూ. 52 కోట్లు, మన తెలుగు రాష్ట్రాల నుండి రూ. 26 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 50 కోట్లు, అలానే రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 22 కోట్లు రాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో కూడా క్లోజింగ్ స్థాయికి చేరుకుంది. రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ, సముద్రఖని, ఎస్ జె సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందించగా రెడ్ జెయింట్ మూవీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు దీనిని భారీ స్థాయిలో నిర్మించాయి.