Home సినిమా వార్తలు Bhagyasri Borse Talk of the Industry రిలీజ్ కి ముందే టాక్ ఆఫ్ ది...

Bhagyasri Borse Talk of the Industry రిలీజ్ కి ముందే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా భాగ్యశ్రీ

bhagyashri borse
bhagyashri borse

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మిస్టర్ బచ్చన్. ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి విజయం అందుకున్న ది రెయిడ్ కి అఫీషయల్ రీమేక్ ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో వివేక్ కూచిభొట్ల, టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా తొలిసారిగా టాలీవుడ్ కి హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్సే పరిచయం అవుతోంది.

ఇప్పటికే మిస్టర్ బచ్చన్ నుండి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ అన్ని కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. విషయం ఏమిటంటే, ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ మొదలుకొని ప్రతి సాంగ్ లో కూడా హీరోయిన్ భాగ్యశ్రీ అందం అందరినీ ఎంతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హీరోయిన్స్ ని అద్భుతంగా చూపించే హరీష్ శంకర్, ఈ మూవీలో కూడా ఆమెని ఆకట్టుకునే రీతిన చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

మరీ ముఖ్యంగా ఆమెకు సోషల్ మీడియాలో విపరీతంగా ఆడియన్స్ లో క్రేజ్ పెరిగింది. మిస్టర్ బచ్చన్ నుండి ఆమె లుక్స్ తాలూకు ఫోటోలు వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి ఫస్ట్ మూవీ ద్వారా భాగ్యశ్రీ ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే ఆగష్టు 15న ఈ మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version