రాజమౌళి, సుకుమార్ ఈ పేర్లు సినీ ప్రేక్షకులకు తెలియని వారు ఉండరు. ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలు ఆ స్థాయికి తీసుకు వెల్లై అప్పట్లో ఇది చాలా పెద్ద విషయం. అయితే ఇప్పుడు తెలుగులో మరో సినిమా సీక్వెల్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో స్టార్ డైరెక్టర్ లేడు. స్టార్ హీరో లేడు. కథ బలంగా ఉంటుందని అంటున్నారు.
ఇంతకీ ఆ సినిమా వివరాల్లోకి వెళితే.. ఆ సినిమా పేరు “బ్యాచ్”. మొదటి భాగం ఈ నెల 18న విడుదల కానుంది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. దర్శకుడు కొత్త.. హీరోకి కూడా హీరోగా తొలి సినిమా.. అవును హీరోకి హీరోగా తొలి సినిమా.. 85కి పైగా చిత్రాలలో బాల నటుడిగా మనకు పరిచయమైన సాత్విక్ వర్మ. బాహుబలి, దువ్వాడ జగన్నాథం, రేసుగుర్రం వంటి చిత్రాలతో ఈ బ్యాచ్‌తో హీరోగా పరిచయం అవుతున్నాడు.
బేబీ ఆరాధ్య సమర్పణలో ఆకాంక్ష మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాత్విక్ వర్మ, నేహా పటాన్ జంటగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివ మాట్లాడుతూ.. ‘‘యూత్ బెట్టింగ్, మగ వ్యభిచారం నేపథ్యంలో సాగే కథ ఇది. రఘు కుంచె అందించిన సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది.
ఇప్పటికే విడుదలైన పాటలు మిలియన్ వ్యూస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. చిత్ర నిర్మాత రమేష్ ఘన్మజ్జి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా వ్యాపారంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.. ఇందులో నటించిన సీనియర్ ఆర్టిస్టులందరూ చాలా బాగా నటించారు.. వారంతా ఫుల్ సపోర్ట్ చేశారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా ‘బ్యాచ్’ సినిమా 100% హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను