Homeసినిమా వార్తలుBalakrishna: వీరసింహారెడ్డి సినిమా తొలిరోజు టాక్ మరియు ఓపెనింగ్స్ అంచనా

Balakrishna: వీరసింహారెడ్డి సినిమా తొలిరోజు టాక్ మరియు ఓపెనింగ్స్ అంచనా

- Advertisement -

వీరసింహారెడ్డి సినిమా ఈరోజు అన్ని ఏరియాల్లో అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. ఎర్లీ మార్నింగ్ షోలు అన్ని చోట్లా హౌస్ ఫుల్ లతో ప్రారంభమయ్యాయి. ఫస్ట్ హాఫ్ కి ఎబోవ్ యావరేజ్ టాక్ రాగా సెకండ్ హాఫ్ యావరేజ్ టాక్ తో దూసుకుపోతోంది. ఓవరాల్ గా ఈ సినిమా ఎబోవ్ యావరేజ్ – యావరేజ్ రిపోర్ట్స్ తో పాటు బాక్సాఫీస్ వద్ద సంచలన ఓపెనింగ్స్ తో దూసుకెళ్తోంది.

నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా జనవరి 12న అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదలకు ముందు మాస్ ప్రేక్షకులలో మరియు బాలయ్య అభిమానులలో భారీ బజ్ సృష్టించింది, ఎందుకంటే ఈ సినిమాలో బాలయ్య పోషించే పాత్ర తన మాస్ ఇమేజ్ కు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని అందరూ గట్టిగా నమ్మారు.

ఐతే వీరసింహారెడ్డి టాక్ కాస్త మిక్స్ డ్ గా అనిపించవచ్చు కానీ ఈ సినిమా ఒక కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ కాబట్టి రివ్యూస్ కంటే కూడా సినిమా రిజల్ట్ పై సాధారణ ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుంది అనేది ముఖ్యం కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనే చెప్పాలి. ఇటీవలే ధమాకా సినిమా కూడా రివ్యూలు సరిగా రాకున్నా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.

READ  Veera Simha Reddy: యూఎస్ఏ ప్రీ-సేల్స్ లో $ 100 కె మార్క్ దాటి సంచలనం సృష్టించిన వీరసింహారెడ్డి

ఇక వీరసింహారెడ్డి సినిమాకు థమన్ అందించిన నేపథ్య సంగీతం కూడా హైలెట్ గా నిలిచిందని అంటున్నారు. కాగా సుగుణ సుందరి, జై బాలయ్య వంటి పాటలు ఇప్పటికే విడుదలకు ముందే మంచి హిట్ అయ్యాయి. బాలకృష్ణ గత చిత్రం అఖండ సినిమాకి థమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు భారీ ప్రశంసలు అందుకున్నారు.

వీరసింహారెడ్డి తొలి రోజు బాక్సాఫీస్ వద్ద అన్ని ఏరియాల్లో బాలకృష్ణ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఇస్తుందని భావిస్తున్నారు. అన్ని ఏరియాల్లో ఈ సినిమాకు సూపర్ స్ట్రాంగ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి మరియు మొదటి రోజు గ్రాస్ సులభంగా 40 కోట్లకు పైగా ఉంటుందనే అంచనా వేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా డే 1 45 కోట్ల గ్రాస్, 25 కోట్ల వరకు షేర్ వస్తుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Chiranjeevi: చెడు ఫలితాలు వచ్చినప్పటికీ తన సినిమాలను వరుసగా హిందీలో విడుదల చేస్తున్న చిరంజీవి


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories