Homeసినిమా వార్తలురాజకీయ కార్యక్రమంగా మారుతున్న బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షో

రాజకీయ కార్యక్రమంగా మారుతున్న బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షో

- Advertisement -

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో నిస్సందేహంగా తెలుగులో అత్యధికంగా వీక్షించిన టాక్ షో అని చెప్పవచ్చు. ఫిల్టర్‌లు లేకుండా మాట్లాడే బాలకృష్ణ శైలి, ఆయన ఉల్లాసమైన స్వభావం మరియు సరదాగా నడుచుకునే వైఖరి ప్రేక్షకులను అమితంగా అలరించింది. కాగా ఈ షో విజయవంతం అవడం మాత్రమే కాకుండా ఆహా యాప్ పాపులర్ అవడంలో ఎంతో సహాయపడింది.

అన్‌స్టాపబుల్ యొక్క సీజన్ 1 భారీ విజయాన్ని సాధించింది. చాలా మంది సూపర్ స్టార్‌లు, ప్రముఖ దర్శకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ప్రముఖ సెలబ్రిటీలతో బాలకృష్ణ ఇంటరాక్షన్ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక ఇటీవలే అన్‌స్టాపబుల్‌ రెండవ సీజన్ చంద్ర బాబు నాయుడు మరియు లోకేష్‌తో ప్రారంభమైంది. ఆ ఎపిసోడ్ లో వివాదాస్పద రాజకీయ ప్రశ్నలతో పాటు CBN యొక్క సరదా వైఖరిని కూడా చూపించింది. అయితే ఈ షోను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని పలువురు అభిప్రాయపడ్డారు.

ఆ తర్వాత విశ్వక్, సిద్ధు జొన్నలగడ్డ, శర్వానంద్ మరియు అడివి శేష్ వంటి యువ హీరోలతో రెండు ఎపిసోడ్ల తర్వాత అన్‌స్టాపబుల్‌ షో మరోసారి రాజకీయ రంగు పులుముకోనుంది.

తాజాగా రాబోయే ఎపిసోడ్‌లో మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అతిథిగా హాజరవుతున్నారట. ఇది ప్రస్తుతం నెటిజన్లకు హాట్ టాపిక్‌గా మారింది. బాలయ్య, కిరణ్ కుమార్ ఇద్దరూ నిజాంలో కాలేజీ విద్యార్థులుగా కలిసి చదువుకున్నారు. ఇరువురూ మంచి స్నేహితులు కూడా.

READ  రెంటల్ పద్ధతిలో OTTలో స్ట్రీమింగ్ అవుతున్న పొన్నియిన్ సెల్వన్

బాలకృష్ణ – కిరణ్ కుమార్ రెడ్డి మధ్య బంధం తదుపరి ఎపిసోడ్‌లో కనిపించబోతుంది. అయితే ఈ వార్తతో ప్రేక్షకులు కాస్త నిరాశ చెందారు. సినిమా మరియు ఇతర విషయాల కంటే ఈ షో రాజకీయంగా మారుతుందని వారు పేర్కొన్నారు.

సినీ నటులకు ఉన్నంత స్టార్ స్టేటస్ రాజకీయ నాయకులకు ఉండదన్న సంగతి తెలిసిందే. వారు తమ రంగాలలో ప్రసిద్ధి చెంది ఉండవచ్చు, కానీ వినోద కార్యక్రమాలలో వారికి తక్కువ ఆకర్షణ ఉంది. టాక్ షో ను క్రమం తప్పకుండా రెగ్యులర్ ఫాలోయర్లు కూడా ఇదే ఫీల్ అవుతున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద పోటీకి సిద్ధం అవుతున్న సంక్రాంతి - 2023


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories