టాలీవుడ్ స్టార్ యాక్టర్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యువ దర్శకడు బాబీ దర్శకత్వంలో తన కెరీర్ 109వ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఆయన తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ కోసం అంతా సిద్ధం చేస్తున్నారు బాలకృష్ణ.
ఇటీవల హను మాన్ మూవీతో భారీ సక్సెస్ సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్న ఈ మూవీ మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 6న గ్రాండ్ గా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీని మైథలాజికల్ టచ్ తో కూడిన సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ గా రూపొందించనుండగా ఇది మహాభారతం బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని అంటున్నారు.
అలానే ఇందులో అభిమన్యుని పాత్రలో మోక్షజ్ఞ కనిపించనుండగా ఒక ముఖ్య పాత్రలో బాలకృష్ణ నటించనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. అత్యంత భారీ వ్యయంతో రూపొందనున్న ఈ మూవీని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పటి నుండే అందరిలో మంచి ఆసక్తి రేపిన ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందో, రిలీజ్ తరువాత ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.