టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా యువ దర్శకుడు బాబీతో కలిసి తన కెరీర్ 109వ మూవీ చేస్తున్నారు. ఊర్వశి రౌటేలా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
ఈ ఏడాది డిసెంబర్ లో దీనిని ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చే అవకాశం కనపడుతోంది. విషయం ఏమిటంటే, కెరీర్ పరంగా బాలకృష్ణ నటుడిగా తెలుగు సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి ఆగష్టు 29 తో 50 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా హైదరాబాద్ లో ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు.
ఈ ఈవెంట్ కి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. త్వరలో ఏర్పాట్లు ప్రారంభం కానున్న ఈ ఈవెంట్ కి భారీ స్థాయిలో నందమూరి అభిమానులు కూడా తరలివచ్చేలా ఏర్పాట్లు మరింత ఘనంగా నిర్వహించనున్నారట. 1974లో వచ్చిన తాతమ్మ కల సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. ఆ సమయంలో ఆయన వయసు 14 ఏళ్ళు కాగా, సీనియర్ ఎన్టీఆర్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఆ మూవీ అప్పట్లో మంచి విజయం అందుకుంది.