బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి గత వారం విడుదలై మిక్స్ డ్ రివ్యూలు, పబ్లిక్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ లో 69% రికవరీ చేసింది. ఇక ప్రస్తుతానికయితే నిలకడగా ఉన్న ఈ సినిమా సేఫ్ జోన్ లోకి ప్రవేశించడానికి మరో రెండు రోజుల సాలిడ్ కలెక్షన్లు అవసరం.
బాలకృష్ణ ద్విపాత్రాభినయం ద్వారా చూపిన నటనకి అభిమానులు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. బాలయ్య ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ని అభిమానులు బాగా ఎంజాయ్ చేయగా, ఈ సినిమాలో ఆయన సందించిన పొలిటికల్ రిఫరెన్స్ ల పై మాత్రం సాధారణ ప్రేక్షకులు చిన్నపాటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
బాలకృష్ణ రాజకీయాలు వేరు సినిమాలు వేరు అమి అర్థం చేసుకోవాలని, తన ఎజెండాను కూడా బలవంతంగా సినిమాలో తీసుకురావడం వల్ల తనకు ఏ మాత్రం ఉపయోగపడని.. అలాగే అనవసరపు పొలిటికల్ టచ్ వల్ల సినిమా పై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
బాలయ్య ఆఫ్ స్క్రీన్ లో కాకుండా ఆన్ స్క్రీన్ లో మాత్రమే ప్రభుత్వం పై విరుచుకుపడగలరని కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాలుగా బాలకృష్ణ పలు ట్రోల్స్ కు గురవుతున్నారు.
బాలకృష్ణ సినిమాల పట్ల తన వైఖరిని మార్చుకుని అనవసరమైన నెగిటివిటీని సృష్టించే రాజకీయ ప్రసంగాలు, కుటుంబ రాజకీయ ప్రస్తావనలకు దూరంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది.