చాలా రోజులుగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య అంతా సవ్యంగా లేదని అంతర్గత వర్గాల ద్వారా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నందమూరి బాబాయి – అబ్బాయ్ ల మధ్య విభేదాలు వచ్చాయనే వార్తలు కొత్తేమీ కాదు. కుటుంబ వేడుకల్లో తప్ప ఈ స్టార్ హీరోలిద్దరూ కలిసి కనిపించడం కానీ మాట్లాడడం కానీ చాలా తక్కువ అనే సంగతి తెలిసిందే.
వీరిద్దరి మధ్య విభేదాలున్నాయనే పుకార్లకు బలం చేకూర్చే సంఘటన ఒకటి నందమూరి తారకరత్న పెద్ద కర్మలో జరిగింది. స్వర్గీయ నటుడు, రాజకీయ నాయకుడు తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమానికి ఎన్టీఆర్ గురువారం హాజరయ్యారు. పలు వైరల్ ఫోటోలు, వీడియోల్లో ఎన్టీఆర్ తారకరత్నకు నివాళులు అర్పించడాన్ని మనం చూడవచ్చు.
ఇక కళ్యాణ్ రామ్, నందమూరి బాలకృష్ణతో పాటు ఇతర స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా తారకరత్నకు నివాళులు అర్పించారు. అయితే ఆ సమయంలో బాలకృష్ణను చూసిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ తమ బాబాయి పట్ల గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు కానీ బాలకృష్ణ వారిని పట్టించుకోను కూడా పట్టించుకోలేదు. ఈ వీడియో చూసిన నందమూరి ఫ్యామిలీ అభిమానులు షాక్ అవుతున్నారు.
అయితే కొంత మంది మాత్రం బాలకృష్ణకు ఎన్టీఆర్ తో విభేదాలు ఉంటే ఉండచ్చు కానీ కళ్యాణ్ రామ్ తో ఈ సమస్యా లేదని అంటున్నారు. అందుకు ఉదాహరణగా ఇటీవల బింబిసార స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరైన విషయాన్ని గుర్తు చేస్తూ.. కళ్యాణ్ రామ్ తో బాలకృష్ణకు ఎలాంటి ఇబ్బంది లేదని కొందరు అభిమానులు, నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఎన్టీఆర్ కూడా అక్కడే ఉండటంతో వారిద్దరినీ ఆయన విస్మరించారని, లేకపోతే తారకరత్న పెద్ద కర్మలో కళ్యాణ్ రామ్ తో బాలయ్య ఖచ్చితంగా మాట్లాడేవారని అంటున్నారు.
తారకరత్న ఫిబ్రవరి 18న గుండెపోటుతో కన్నుమూశారు. ఉత్తమ చికిత్స నిమిత్తం ఆయనను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
జనవరి 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా కుప్పకూలిన తారకరత్న ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ముందుగా ఆయనని కుప్పంలోని ఆసుపత్రికి తరలించి పీసీఆర్ ఇచ్చారు. అయితే, ఆయన గుండె పనిచేయడం మానేయడంతో, పరిస్థితి విషమించడంతో గత నెలలో కోమాలోకి జారుకున్నారు.