ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ సినిమా జైలర్ 2. ఇటీవల రిలీజై బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ కాలేచ్ట్ చేసిన సినిమా జైలర్. దానికి సీక్వెల్ గా ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ మూవీపై రజనీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా విశేషమైన అంచునాలున్నాయి.
ఈ సినిమా యొక్క షూటింగ్ ప్రస్తుతం వేగవంతంగా జరుగుతుంది. అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒక ముఖ్యమైన కీలక పాత్రలో కనిపించనున్నట్లు కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి.
లేటెస్ట్ రిపోర్ట్స్ ను బట్టి బాలకృష్ణ ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని ఆయన పాత్ర యొక్క నిడివి 10 నుంచి 15 నిమిషాలు ఉంటుందని చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ పాత్ర థియేటర్స్ లో అదిరిపోతుందని టాక్ మరోవైపు రజినీకాంత్ కూడా ఇందులో జైలర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
మరి బాలకృష్ణ ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్ర చేస్తుంది కనుక నిజమే అయితే అది జైలర్ 2 మూవీకి మరింత ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పటంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇక ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ కూడా అందుకునే అవకాశం కూడా లేకపోలేదు. మరి త్వరలో ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమా ఎంత మేరా విజయవంతంగా చూడాలి