Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రానికి ‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్‌ను మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేశారు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, ఫస్ట్ హంట్ టీజర్ వీడియోలు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే తాజాగా మెగా హీరో అల్లు శిరీష్ నటిస్తున్న ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు బాలయ్య చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ నటిస్తున్న సినిమా విజయం సాధించాలని బాలయ్య కోరారు. ఈ క్రమంలో యంగ్ డైరెక్టర్ పరశురామ్ కూడా ఈ ఈవెంట్ కు హాజరవగా, ఆయన బాలయ్యతో ఓ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నట్లు పేర్కొన్నాడు.
పరశురామ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసిన ‘సర్కారు వారి పాట’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను రీసెంట్‌గా అందుకోగా, ప్రస్తుతం యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యతో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే బాలయ్య అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయనతో ఓ పవర్‌ఫుల్ సినిమాను ఎప్పటికైనా చేసి తీరుతానని పరశురామ్ చెప్పుకొచ్చాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. బాలయ్యనేమో ఊరమాస్.. పరశురామ్ ఏమో క్లాస్.. మరి ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తే, అది ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఈ కాంబినేషన్ గురించి టాలీవుడ్‌లో చర్చ జరుగుతుండటం విశేషం.