Homeసినిమా వార్తలుBalagam: గ్లోబల్ వేదిక పై 2 పెద్ద అవార్డులను గెలుచుకున్న బలగం

Balagam: గ్లోబల్ వేదిక పై 2 పెద్ద అవార్డులను గెలుచుకున్న బలగం

- Advertisement -

వేణు యెల్దండి యొక్క బలగం అన్ని వేదికల పైనా ప్రకాశిస్తుంది. థియేట‌ర్లలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమా విడుద‌లైన నెల రోజుల‌ తర్వాత కూడా మంచి వ‌సూళ్లు రాబ‌డుతోంది. ఇక ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ చిత్రానికి మరింత అద్భుతమైన స్పందన రావడం మొదలైంది.

ఆ క్రమంలో, ఈ చిత్రం అంతర్జాతీయ వేదిక పై కూడా ఎవరూ ఊహించని పెద్ద విజయాన్ని సాధించడం విశేషం. సినిమాలోని కంటెంట్ కు గుర్తింపుతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా చక్కని విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఖాతాలోకి మరో ఘనవిజయం చేరింది.

https://twitter.com/VenuYeldandi9/status/1641410101314752514?t=Ilv90iu_HtXlpOQEkgW9OQ&s=19

లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో బలగం సినిమా ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ మరియు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ అవార్డులను గెలుచుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఇది మూడో పెద్ద అవార్డు కావడం మరో విశేషం. ఈ విషయాన్ని వేణు తన ట్విటర్‌ ఎకౌంట్ ద్వారా సినీ ప్రియులతో పంచుకున్నారు.

READ  Kabzaa: ఇండియన్ సినిమాల్లో మునుపెన్నడూ లేని విధంగా నకిలీ కలెక్షన్ల ప్రకటన - 100 కోట్ల పోస్టర్ రిలీజ్ చేసిన కబ్జా టీం

ప్రియదర్శి పులికొండ, కావ్య కళ్యాణ్‌రామ్, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప మరియు కేతిరి సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బలగం. కాగా చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సృష్టించింది. ముఖ్యంగా నైజాంలో ఈ సినిమా రూ.20 కోట్ల మార్కును చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది.

Follow on Google News Follow on Whatsapp

READ  Balagam: ఒక్క నైజాంలోనే 20 కోట్ల గ్రాస్ దిశగా దూసుకెళ్తోన్న బలగం సినిమా


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories