బలగం సినిమా విజయ పరంపర ఇంకా ముగియలేదు. తెలంగాణ ప్రేక్షకులు చాలా భారీ స్థాయిలో బలగంను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతోంది.
తెలంగాణలోని గ్రామ నాయకులు దాదాపు ప్రతి గ్రామంలో తమ ప్రజల కోసం బలగం చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. నిజానికి ఈ రోజుల్లో ఇది చాలా అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు . ఆ స్పెషల్ స్క్రీనింగ్స్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. కాగా పల్లెల్లోనే కాదు అంతర్జాతీయ వేదిక పై కూడా బలగం ప్రశంసలు అందుకుంటున్నది.
నిన్న ఉక్రెయిన్‌లో జరిగిన ఓక్యో ఫిల్మ్ అవార్డ్స్‌లో ఈ చిత్రం ఉత్తమ డ్రామా ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. అంతటితో ఆగకుండా విజయవంతమైన ఈ చిత్రం మరో 4 అవార్డులను గెలుచుకుంది. బలగం వాషింగ్టన్ DC ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్‌లో ఉత్తమ ఫీచర్ డైరెక్టర్ (వేణు యెల్దండి), ఉత్తమ నటుడు (ప్రియదర్శి), ఉత్తమ నటి (కావ్య కళ్యాణ్‌రామ్), మరియు ఉత్తమ కథనం (వేణు యేల్దండి) అవార్డులను గెలుచుకుంది.
ఈ చిత్రం నిజంగా ఈ అవార్డులకు అర్హమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తన విజయ పరంపరలో బాగంగా ఈ చిత్రం రానున్న రోజుల్లో మరిన్ని అవార్డుకు అందుకోనుంది. ఈ గౌరవాన్ని అందుకోవడం పట్ల చిత్ర బృందం చాలా ఆనందంగా ఉంది.
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ జంటగా నటించిన ‘బలగం’ చిత్రానికి హాస్యనటుడు నుండి దర్శకుడిగా మారిన వేణు యెల్దండి దర్శకత్వం వహించారు. మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రాచ రవి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రంలో హర్షిత్ రెడ్డి మరియు హన్షిత రెడ్డి నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.