టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ అండ్ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కీలకపాత్రల్లో దిగజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ స్ర్టింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB29. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అందరు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథని అందించారు. ప్రస్తుతం రెండు షెడ్యూల్స్ జరుపుకొన్న ఈ సినిమా అతి త్వరలో హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో తదుపరి షెడ్యూల్ ప్రారంభానికి సంసిద్ధమవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కనీవినీ ఎరగని ఒక అత్యద్భుతమైన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఏ న్యూస్ అయినా ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ గా మారుతుంది.
వాస్తవానికి ఈ సినిమా యొక్క అనౌన్స్మెంట్ ని మార్చి 30న ఉగాది కానుకగా ఇవ్వాలని భావించారని కొన్నాళ్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం అది ఇప్పట్లో ఉండే అవకాశం లేదని అంటున్నారు. అతి త్వరలో హైదరాబాద్ షెడ్యూల్ అనంతరం యూనిట్ మొత్తం కూడా కెన్యా, సౌత్ ఆఫ్రికా, బల్గేరియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ వంటి దేశాలకి పయనమవుతుందని, అయితే ఈ మధ్యలోనే ఎప్పుడో ఒకసారి మంచి ముహూర్తం చూసి అనౌన్స్ మెంట్ అప్డేట్ అందించాలని రాజమౌళి అండ్ టీం ఫిక్స్ అయ్యారని చెబుతున్నారు.
మరి ఇదే గనక నిజమైతే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ సినిమా లవర్స్ అందరికీ కూడా ఇది డిజప్పాయింటింగ్ న్యూస్ అని చెప్పాలి. మరి పక్కాగా SSMB29 అప్డేట్ ఎప్పుడు వస్తుందో తెలియాలంటే కొన్నాళ్ల వరకు వెయిట్ చేయక తప్పదు.