నందమూరి బాలకృష్ణ యొక్క వీరసింహారెడ్డి చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ మార్కును దాటింది. అఖండ తర్వాత నందమూరి బాలకృష్ణ సినిమాల్లో 100 కోట్ల క్లబ్ లో చేరిన రెండో సినిమా ఇది. దాదాపు 67 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా ఈ వీకెండ్ లో అఖండ షేర్ ను క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
అఖండ నుంచి బాలకృష్ణ తన కెరీర్ లో మంచి దశను ఆస్వాదిస్తున్నారు. అప్పటి వరకు ఆయన బాక్సాఫీస్ స్టామినా కాస్త నిలకడగా లేకున్నా ఒక్క సినిమా మాత్రం అన్నీ మార్చేసింది. ఇప్పుడు వీరసింహారెడ్డి కలెక్షన్లే దీనికి పెద్ద నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మిక్స్ డ్ టాక్ తో బాలకృష్ణకు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించిన ఈ సినిమా ఈ వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ మార్కును చేరుకోనుంది.
బాలకృష్ణ నటించిన అఖండ ఇప్పటికే ఉన్న అనేక రికార్డులను బద్దలు కొట్టి బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ సినిమా ఓటీటీలో కూడా ఓ ప్రత్యేకమైన రికార్డును క్రియేట్ చేసింది. కోవిడ్-19 సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ కి క్లీన్ హిట్ గా ఈ సినిమా నిలిచింది. వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ తో అఖండ మాస్ సినిమాల సత్తా ఏంటో మరోసారి నిరూపించింది.
ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విలువ 53.65 కోట్లు కాగా.. 71 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ షేర్ వసూలు చేసి అన్ని పార్టీలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
ఇప్పుడు వీరసింహారెడ్డి అఖండను క్రాస్ చేసి బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలవడానికి సిద్ధంగా ఉంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్, మాస్ ఎలిమెంట్స్ ను పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తో మిక్స్ చేయగలరు కాబట్టి బాలకృష్ణ తదుపరి చిత్రం (NBK108) ఖచ్చితంగా బాలకృష్ణను మరో స్థాయికి తీసుకెళ్తుంది అని ఆయన అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.