బాలీవుడ్ యువ నటుడు వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా ప్రముఖ నటుడు జాకీష్రాఫ్ విలన్ గా కలీస్ దర్శకత్వంలో తరికక్కుతున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా బేబీ జాన్. కొన్నేళ్ల క్రితం కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన తేరీ మూవీకి అఫీషియల్ రీమేక్ ఇది. ఇళయదళపతి విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా అమీ జాక్సన్ సెకండ్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం అందుకుంది.
ఇక ప్రస్తుతం ఈ సినిమాని తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా దర్శికుడు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో తీస్తున్న విషయం తెలిసిందే. శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బేబీ జాన్ విషయానికి వస్తే ఈ మూవీని గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన తాజా ఫస్ట్ లుక్ టీజర్ అందరిలో కూడా సినిమాపై బాగా హైప్ ఏర్పరిచింది.
ముఖ్యంగా బేబీ జాన్ లో వరుణ్ ధావన్ పవర్ ఫుల్ లుక్స్ తో పాటు ఫైట్స్, యాక్షన్స్ అన్నివేశాలు విలన్ గా నటిస్తున్న జాకీష్రాఫ్ పాత్ర కూడా అదిరిపోయాయి. మొత్తంగా చెప్పాలి అంటే బేబీ జాన్ టీజర్ సినిమా పై భారీ స్థాయిలో ఇప్పటివరకు ఉన్న అంచానలు పెంచేసింది. ఈ మూవీ డిసెంబర్ 25 న క్రిస్మస్ కానుకగా గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏ స్థాయిలో విజయవంతం అవుతుందో చూడాలి