లైగర్ సెటిల్మెంట్ కోసం కొంత సమయం తీసుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్.. గడువులోగా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో వివాదం రేగింది. దీంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు పూరీ ఇంటి ముందు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో పూరీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ తాజాగా రాసిన ఓ లేఖ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.
సక్సెస్, ఫెయిల్యూర్ రెండూ పరస్పర విరుద్ధమైనవే అనే వాదన నిజం కాదని పూరీ జగన్నాథ్ ఆ లేఖలో పేర్కొన్నారు. గుండె నిండా ఊపిరి పీల్చుకుంటే బతుకుతాం అనుకుంటాం కానీ వెంటనే చేయాల్సిన పని ఊపిరి పీల్చుకోవడం అని పూరీ అన్నారు. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదని పూరీ అన్నారు. జీవితంలో మనకు జరిగే ప్రతి సంఘటనను ఒక అనుభవంగా చూడాలి.
అపజయాలు, విజయాలు అన్నీ కూడా సినిమాలో సన్నివేశాల లాగా ఉంటాయి, షో అయిపోయాక వాటిని మర్చిపోవచ్చు. అలాగే జీవితం కూడా.. ఎక్కువగా ఆలోచిస్తే మెంటల్ ఎక్కుతుందని పూరీ తనదైన స్టైల్ లో చెప్పారు. ఇక జీవితంలో విజయం సాధిస్తే డబ్బులు వస్తాయని, అలానే విఫలమైతే జ్ఞానం పొందుతామని పూరి అన్నారు. కాబట్టి మనం ఎప్పుడూ మానసికంగా, ఆర్థికంగా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం.. ఈ ప్రపంచంలో మనం కోల్పోయేది ఏమీ లేదు. అందుకే దేన్నీ ఫెయిల్యూర్‌గా చూడకూడదని పేర్కొన్నారు.
చెడు జరిగితే మన చుట్టూ ఉన్న చెడ్డవాళ్లు మాయమైపోతారని.. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ పరిస్థితుల్లో మనల్ని ఎవరు వదిలేశారో తెలుస్తుందని కూడా పూరి అన్నారు. రిస్క్ తీసుకోకుంటే జీవితం ఏ లేదని, ఏ రిస్క్ తీసుకోకపోవడం కూడా ఒక రిస్క్ ఏ నని పూరీ అన్నారు.
ఒక సినిమాలో హీరోకి ఏం జరుగుతుందో అదే జీవితంలో కూడా మనం హీరోగా ఉంటే మనకు కూడా అవే జరుగుతాయి. అందరూ మన కోసం చప్పట్లు కొడతారు, ప్రశంసిస్తారు మరియు నిందిస్తారు కూడా. కాబట్టి ఇవన్నీ మీ జీవితంలో జరగకపోతే, వాటిని జరిగేలా చూసుకోండి. లేకపోతే, మీరు హీరో కాకపోయే ప్రమాదం ఉంది. అందుకే హీరోలుగా జీవించాలి అని పూరి అన్నారు.
హీరోలు గా ఉండాలంటే నిజాయతీతో ఉండాలని, అయితే తాను నిజాయితీపరుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని పూరీ అన్నారు. నిజాన్ని రక్షించాల్సిన అవసరం లేదు. నిజమే నిజాన్ని కాపాడుతుంది. ఎవరి దగ్గరా ఏమీ ఆశించకుండా, ఎవరినీ మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటే మనల్ని మోసం చేసేవారు ఉండరు.
నేనెప్పుడైనా మోసం చేస్తే.. దగా చేస్తే ఆది నన్ను నమ్మి నా సినిమా టిక్కెట్లు కొన్న ప్రేక్షకులను మాత్రమే అని పూరీ అన్నారు. నిజానికి ప్రేక్షకుల పట్ల తనదే బాధ్యత అని పూరీ జగన్నాథ్ అన్నారు.
మరో సినిమా చేసి వారిని అలరిస్తాను. ఇక డబ్బు అంటారా.. చనిపోయిన తర్వాత ఇక్కడి నుంచి ఒక్క రూపాయి తీసుకున్న వ్యక్తి పేరు చెప్పండి. అప్పుడు నేను కూడా డబ్బులు దాచుకుంటా అని పూరీ అన్నారు. చివరగా అందరూ కలిసేది స్మశానంలోనే అని , మధ్యలో జరిగేదంతా డ్రామా అని పూరీ జగన్నాథ్ తన లేఖను ముగించారు.
జీవితంలో సక్సెస్, ఫెయిల్యూర్ అంటూ పూరీ రాసిన లెటర్ చదివిన ప్రేక్షకులు.. గత కొన్నాళ్లుగా పూరీ జగన్నాథ్ ఫిలాసఫీలు మాత్రమే చెబుతున్నాడని, స్క్రిప్ట్ ఎప్పుడు రాస్తాడో అనే ఫీలింగ్ కలుగుతోందని అంటున్నారు. ఫిలాసఫీలు చెప్పడం కంటే మంచి స్క్రిప్ట్‌కి ఎక్కువ సమయం కేటాయించి రాయమని ప్రేక్షకులు పూరీ జగన్‌కి సలహా ఇస్తున్నారు.