ఈరోజు సాయంత్రం తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ నటుడు నరేష్ క్యారవాన్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు, ఈ సంఘటన పై నరేష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది ఆయన మాజీ భార్య ప్లాన్ చేసిన ఎటాక్ అని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి, అయితే ప్రస్తుతానికి ఈ విషయం గురించిన అధికారిక సమాచారం ఏదీ రాలేదు.
ప్రముఖ నటుడు నరేష్ గత కొంతకాలంగా పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం నిరంతరం ముఖ్యాంశాలలో నిలిచింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఆయన చాలా సార్లు తనతో మీడియా ద్వారా లింక్ చేయబడిన నటి పవిత్రా లోకేష్‌ను వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఆయన అప్పటికే మూడు వివాహలు చేసుకున్నారు మరియు తన మూడవ భార్య రమ్య రఘుపతికి ఇంకా విడాకులు ఇవ్వలేదు.
గచ్చిబౌలిలోని తన ఇంటి పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు తన క్యారవాన్‌ను ధ్వంసం చేశారని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేయడంతో అతను మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఈ దాడి వెనుక తన భార్య రమ్య, ఆమె బృందం హస్తం ఉండవచ్చని నరేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తనను చంపాలని ఆమె కోరుకుంటోందని, అందుకే ఈ దాడులు చేస్తున్నారని ఆయన పోలీసులకి తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులకు సమర్పించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గత కొన్ని నెలలుగా, నరేష్ మరియు రమ్య ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు మరియు ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు.