Home సినిమా వార్తలు Atlee Eyes the International Stage ఇంటర్నేషనల్ స్టేజ్ పై కన్నేసిన అట్లీ

Atlee Eyes the International Stage ఇంటర్నేషనల్ స్టేజ్ పై కన్నేసిన అట్లీ

atlee

కోలీవుడ్ యువ దర్శకుల్లో అట్లీ కూడా ఒకరు. ఇటీవల షారుక్ ఖాన్ తో భారీ మూవీ జవాన్ తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు. ఆ మూవీ రూ. 1000 కోట్లకు పై గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుని దర్శకుడిగా అట్లీకి మరింత మంచి పేరైతే తీసుకొచ్చింది. నిజానికి ఆ మూవీ అనంతరం అల్లు అర్జున్ తో అట్లీ ఒక సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి.

అయితే అది మెటీరియలైజ్ అవ్వలేదు. ఇక లేటెస్ట్ బాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం అట్లీ తన తదుపరి సినిమాని ప్రముఖ బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ తో ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మురగదాస్ తో సికిందర్ అనే భారీ సినిమా చేస్తున్న సల్మాన్ దాని అనంతరం అట్లీ మూవీ చేయనున్నారు. అయితే విషయం ఏమిటంటే అట్లీ సల్మాన్ తో చేయనున్న మూవీతో కేవలం పాన్ ఇండియన్ రేంజ్ లోనే కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో దాన్ని రిలీజ్ చేసేందుకు అలానే తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట.

ఇండియా భాషలతో పాటు చైనీస్, జపనీస్, ఇంగ్లీష్ సహా పలు ఇతర విదేశీ భాషల్లో కూడా ఆ మూవీ రిలీజ్ చేయనున్నారట. ప్రస్తుతం గ్రాండ్ గా ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు క్యాస్టింగ్ యొక్క సెలక్షన్ కూడా జరుగుతుందట. త్వరలో ఈ ప్రతిష్టాత్మక మూవీ గురించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version