Homeసినిమా వార్తలుAtlee Demanding High Remuneration భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న అట్లీ

Atlee Demanding High Remuneration భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న అట్లీ

- Advertisement -

ఇటీవల పుష్ప 2 సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు అనే వార్తలు కొన్నాళ్లుగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఆ భారీ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి చాలానే సమయం పట్టనుందట. 

అందుకే ఈలోపు అట్లీతో అల్లు అర్జున్ ఒక సినిమాకు కమిటీ అయ్యారు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించి డిస్కషన్స్ అటు అల్లు అర్జున్ ఇటు అట్లీ మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుందని కాగా అది సన్ పిక్చర్స్ అని అంటున్నారు. 

అయితే ఈ సినిమాకి సంబంధించి కొద్ది సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఈ సినిమా పరంగా దర్శకుడు అట్లీ రెమ్యునరేషన్ దాదాపుగా రూ. 100 కోట్లు అడుగుతున్నారట. మరోవైపు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తో కలిపి ఇది రూ. 250 నుంచి రూ. 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక సినిమా బడ్జెట్ కూడా కలిపితే ఇది రూ. 600 కోట్లు అవుతుందని ఒకరకంగా ఇది నిర్మాతకు రిస్క్ అని అంటున్నారు. మరోవైపు ఈ సినిమాకి సంబంధించి సన్ నెట్వర్క్ సంస్థతో చర్చలు జరుగుతున్నాయట. 

READ  Retro First Song Release Date Fix '​రెట్రో' ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ 

కాగా త్వరలో పక్కాగా ఈ మూవీకి సంబంధించి అధికారిక అనౌన్స్మెంట్ కూడా వస్తుందనే వార్తలు వస్తున్నాయి. అలానే ఈ సినిమా కోసం యువ సంగీత దర్శకుడు అభ్యంకర్ ని తీసుకుంటున్నారట దర్శకుడు అట్లీ. ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories