ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు పలు చిత్ర పరిశ్రమల్లో రీ రిలీజ్ ల ట్రెండ్ విరివిగా కొనసాగుతోంది. ,ముఖ్యంగా స్టార్స్ యొక్క ఒకప్పటి సినిమాలని తాజాగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తూ పలువురు నిర్మాతలు మంచి కలెక్షన్స్ అందుకుంటున్నారు. ఇక తెలుగు విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు రీ రిలీజ్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది.
ఇటీవల రీ రిలీజ్ అయిన ఆయన సినిమాలు దాదాపుగా అన్ని బాగా కలెక్షన్ అందుకున్నాయి. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ హీరోగా త్రివిక్రమ్ నటించిన ఒకప్పటి సూపర్ హిట్ మూవీ అతడు రీ రిలీజ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఈ మూవీకి ఇప్పటికీ కూడా అన్నివర్గాల ఫ్యాన్స్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.
టెలివిజన్ లో ఎప్పుడు ప్రదర్శితమైనా మంచి రేటింగ్స్ అందుకునే అతడు మూవీని రూ. 3 కోట్లకు రీ రిలీజ్ హక్కులు కొనుగోలు చేశారట. రీ రిలీజ్ లలో ఇదే అత్యధిక ధర. ఇటీవల వచ్చిన మురారి మూవీ దాదాపుగా రూ. 10 కోట్ల మేర కలెక్షన్ రాబట్టడంతో సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా రానున్న అతడు ఇంకెంతమేర రాబడుతుందోనని ఆడియన్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆగష్టు 9న ఈ మూవీ థియేటర్స్ లో రీ రిలీజ్ కానుంది.