Homeబాక్సాఫీస్ వార్తలుబాక్సాఫీస్ వద్ద 200 కోట్ల క్లబ్ లో చేరేలా కనిపిస్తున్న కాంతార

బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల క్లబ్ లో చేరేలా కనిపిస్తున్న కాంతార

- Advertisement -

కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి నటించిన కాంతార దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించింది. కాగా ఈ చిత్రం డబ్ చేయబడిన ప్రతి భాషలోనూ మంచి సమీక్షలతో పాటు థియేటర్ల వద్ద అత్యుత్తమ సంఖ్యలో ప్రేక్షకుల సంఖ్యను నమోదు చేసింది.

ఒక సినిమాకి సరైన పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమా ఏ స్థాయిలో ఆడుతుంది అనేదానికి ఉత్తమ ఉదాహరణగా కాంతార సినిమా నిలిచింది. ఈ చిత్రం గడిచే ప్రతి షోతో గణనీయంగా ప్రేక్షకుల సంఖ్యను పెంచుకుంటూ పోతుంది.

శనివారం (అక్టోబర్ 15) కాంతార చిత్రం తెలుగులో డబ్ చేయబడి విడుదలయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ఇతర భాషలలో విడుదలైంది. కాగా అన్ని భాషలలో ఊహించిన దాని కంటే మెరుగ్గా ప్రదర్శించబడుతోంది. హిందీలో శుక్రవారం విడుదలైన కాంతార తొలి రోజు 1 కోటి, శనివారం 2.5 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లను సాధించింది. అదేవిధంగా, తెలుగు రాష్ట్రాల్లో, తొలి రోజే 2.5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక కర్ణాటకలో, వరుసగా మూడవ వారంలో కూడా చాలా షోలు హౌస్‌ఫుల్‌గా ఉండటం విశేషం.

READ  ముందు దర్శకుడు.. ఇప్పుడు హీరోయిన్ - డీజే టిల్లు సీక్వెల్ లో మార్పులు

ఇక ఈరోజు ఆదివారం సెలవు రోజు కాబట్టి శనివారం కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించే వీలు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఊపుని బట్టి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల గ్రాస్ వసూలు చేయవచ్చు. ప్రస్తుత వేగంతో ఈ చిత్రం 200 కోట్ల అరుదైన క్లబ్‌లో చేరే అవకాశాలన్నీ ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ చిత్రంలో కంబాల ఛాంపియన్‌గా ప్రధాన పాత్రలో కనిపించిన రిషబ్ శెట్టి ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం కూడా వహించారు, కాంతార సినిమాలో విలక్షణ నటుడు కన్నడ కిషోర్, అచ్యుత్ కుమార్ మరియు సప్తమి గౌడ సహాయక పాత్రల్లో నటించారు.

ఇక కాంతార చిత్రం మరో అద్భుతమైన రికార్డుని అందుకుంది. ఇండియన్ సినిమా రేటింగ్స్ విష‌యంలో ఐఎండీబీ (ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌)ది ప్ర‌త్యేక స్థానం. ఏ సినిమాకి అయినా అక్కడ ప‌ర్‌ఫెక్ట్ రేటింగ్ ఉంటుంది. ఇప్ప‌టి వ‌కు కేజీఎఫ్‌2 సినిమా ఐఎండీబీ రేటింగ్స్‌లో ప్రథమ స్థానంలో ఉంది.

ఐఎండీబీలో కేజీఎఫ్‌2 రికార్డు 8.4 రేటింగ్ ను తెచ్చుకుంది. అయితే ఇప్పుడు కేజీఎఫ్2 రికార్డును కాంతార బ్రేk చేసి మొదటి స్థానంలోకి వెళ్ళింది. ఈ క్ర‌మంలో ఐఎండీబీలో కాంతార 9.4 రేటింగ్ ద‌క్కించుకున్న ఘ‌న‌త‌ను సాధించింది. కాగా ఎస్.ఎస్.రాజమౌళి బ్లాక్ బస్టర్ సినిమా RRRకు ఐఎండీబీలో 8.0 రేటింగ్ ఉంది.

READ  NBK107: మైత్రీ మూవీ మేకర్స్ కు రెండు రిలీజ్ డేట్ లు ఇచ్చిన బాలయ్య

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories