Homeసినిమా వార్తలుఆన్లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ లకు షాక్ ఇచ్చిన ...

ఆన్లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ లకు షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల విక్రయాలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల వ్యవహారంలో మరింత స్పష్టతనిస్తూ ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ రూపొందించింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ సినిమా టిక్కెట్లను విక్రయిస్తున్న సంస్థలు కూడా ఇకపై ప్రభుత్వ నోడల్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.

గత సంవత్సరం ‘ వకీల్ సాబ్’ విడుదలకు ముందు రోజు థియేటర్ లో టికెట్ ధరలు మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ, ఆ పైన కొంత కాలం దాని మీద జరిగిన వివాదం తెలిసిందే.

అయితే ఈ ఏడాది మార్చిలో మొత్తానికి ఆ విషయం ఒక కొలిక్కి వచ్చింది. సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద హీరోలు,దర్శక నిర్మాతలు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుని తమకు కావాల్సిన అనుమతులు మంజూరు చేయించుకున్నారు. అయితే కథ అక్కడితో ఆగలేదు.

అప్పట్లో ఈ వివాదం జోరుగా ఉన్న రోజుల్లోనే మరి అంశం తెర మీదకి వచ్చింది.అదేంటంటే ఆన్లైన్ లో టికెట్ లు అమ్మే వెబ్ సైట్ ను ప్రభుత్వం తమ పరిధి లోకి తీసుకోవటం. ఆ విషయం పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఏపీఎఫ్‌డిసి‌కి సర్వీస్‌ ప్రొవైడర్‌ బాధ్యతలు అప్పగించడంతో ఇకపై రాష్ట్రంలోని సినిమా థియేటర్లు ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపై అన్ని థియేటర్లు, ప్రైవేట్ సంస్థలు నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేసే సర్వీస్‌ ప్రొవైడర్ గేట్‌ వే నుంచి టిక్కెట్లను విక్రయించాల్సి ఉంటుంది. ప్రతి టిక్కెట్‌పై 2శాతం మాత్రమే సర్వీస్ ఛార్జీ అమలు చేయాల్సి ఉంటుంది. థియేటర్లలో ఎలాంటి అవకతవకలు లేకుండా ఆన్‌లైన్‌ టిక్కెట్ల విక్రయాలను జరపాల్సి ఉంటుంది. కొత్త సినిమాల విడుదల సమయంలో వారం ముందు మాత్రమే అడ్వాన్స్‌ బుకింగ్ చేయాలని ఆదేశించింది.

READ  దీపికా పదుకునే ఆరోగ్యం బాగానే ఉందంటున్న నిర్మాతలు

ఈ ప్రక్రియ మొదలై అమలు అయ్యేసరికి మరెన్ని సమస్యలు,వివాదాలు తలెత్తుతాయి అనేది చూడాలి. అసలు టికెట్ ల అమ్మకం ద్వారా వచ్చే వసూళ్ళ నేరుగా ప్రభుత్వం తమ ఖాతాలో జమ చేసుకుని తిరిగి మళ్లీ థియేటర్ ల యాజమాన్యానికి ఇవ్వటం ఏమిటో అసలు అర్థం కాకుండా ఉంది. దీని పై పెద్ద నిర్మాతలు, డిస్త్రీ బ్యుటర్ ల స్పందన రావాల్సి ఉంది. మరి ఏపీ ప్రభుత్వం తలపెట్టిన ఈ కొత్త కార్యాచరణ ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  నాలుగు భాషల్లో విడుదల కానున్న మహేష్ బాబు సినిమా


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories