తెలుగు సినిమా పరిశ్రమంలోని స్టార్ నటిమణుల్లో ఒకరు అనుష్క శెట్టి. ఇటీవల యువ దర్శకుడు పి. మహేష్ దర్శకత్వంలో నావీ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చిన అనుష్క దానితో మంచి విజయం ఆదుకున్నారు.
ఇక తాజాగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఆమె చేస్తున్న యాక్షన్ రా రస్టిక్ యాక్షన్ డ్రామా మూవీ ఘాటి. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అందరిలో మంచి అంచనాలు ఏర్పరచిన ఈ సినిమాని క్రిష్ జాగర్లమూడి అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది టీమ్. ఇకపోతే నేడు అనుష్క బర్త్ డే సందర్భంగా ఘాటీ ఫస్ట్ లుక్ టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టీజర్ లో అనుష్క రౌద్ర రూపంతో పాటు పవర్ఫుల్ పర్ఫామెన్స్ అందర్నీ ఒకంత షాక్ కి గురి చేసిందని చెప్పాలి.
తన కెరీర్ లో మొదటిసారి ఇంత పవర్ఫుల్ పాత్ర చేస్తుండగా టీజర్ చూస్తే మూవీ తో కూడా ఆమె పెద్ద విజయం అందుకునే అవకాశం కనబడుతుంది. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తన మార్క్ ఎమోషనల్ యాక్షన్ అంశాలతో దర్శికుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఘాటి వచ్చేది ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక ఈ టీజర్ రిలీజ్ అనంతరం ఘాటిపై అందరిలో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. యువి క్రియేషన్స్ సంస్థ ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది.