ప్రేమమ్ తెలుగు వెర్షన్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ తక్కువ సమయం లోనే చక్కని క్రేజ్ ను సంపాదించుకున్నారు. చక్కని నటనతో పాటు తెలుగులో సొంతంగా డబ్బింగ్ చేప్పుకుంటూ తనదైన స్మైల్/హెయిర్ స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
తాజాగా అనుపమ ప్రధాన పాత్రలో ”బటర్‌ఫ్లై”అనే సినిమాలో నటిస్తున్నారు.ఒక అపార్ట్మెంట్ బ్యాక్ డ్రాప్ లో సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి గంటా సతీష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కోసం అనుపమ తొలిసారిగా గాయనిగా మారటం విశేషం. ‘ఆల్ ది లేడీస్ రైజ్ యువర్ హాండ్స్’ అనే గీతాన్ని ఆలపించిన అనుపమ టాలెంట్ ను ప్రేక్షకులు ఎంతగానో అభినందిస్తున్నారు.పరభాషా నటి అయి ఉండి సొంతంగా డబ్బింగ్ చెప్పడమే కాకుండా ఇప్పుడు పాట కూడా పాడటం అనుపమకు వృత్తి పట్ల ఉన్న అంకిత భావాన్ని తెలియచేస్తుంది.
ఇన్నాళ్లు సోషల్ మీడియాలో సరదాగా పాటలు
పాడుతూ వచ్చిన అనుపమ ఈ సినిమాతో గాయనిగా అధికారికంగా పరిచయమైంది. ఈ పాటకు చక్కటి స్పందన రావడం పట్ల అనుపమ పరమేశ్వరన్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే బటర్‌ఫ్లై సినిమాను OTTలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్లలో విడుదలవ్వడం వలన ప్రేక్షకులు ప్రతి సినిమాని,అందులోనూ చిన్న సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించటం లేదు.అందువల్ల ఈ సినిమా OTTలో విడుదల చేయడం సరైన నిర్ణయంగా భావించవచ్చు.
ప్రస్తుతం అనుపమ తెలుగులో నిఖిల్‌తో ‘18పేజీస్’, ‘కార్తికేయ-2’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది అనుపమ పరమేశ్వరన్. ఈ రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ ఏడాది మొత్తంగా అనుపమ నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.