ముందు నుంచీ అనుమాన పడ్డట్టే జరిగింది. అంటే సుందరానికీ చిత్రం ట్రేడ్ వర్గాలు అనుకున్నట్టు డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకి రిలీజ్ ముందు నుంచి ఉండాల్సినంత క్రేజ్ లేకపోయినా తొలిరోజు వచ్చిన రివ్యూలు, ప్రేక్షకుల స్పందన చూసి కలెక్షన్ లు పెరుగుతాయి అని అందరూ ఆశించారు.
అయితే తొలి వారాంతం తరువాత ఈ చిత్రం ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడింది. ఏమాత్రం నిలకడ లేకుండా సాగిన ఈ సినిమా రన్ ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకులను సైతం అవాక్కయ్యేలా చేసింది. ఒకప్పుడు పరవాలేదు అని టాక్ వస్తే చాలు నాని సినిమా ఆడేస్తుంది అనే పరిస్తితి ఉండేది. ఇప్పుడు చిత్రంగా సినిమా బాగుండీ, డీసెంట్ టాక్ ఉండి కూడా ఇలాంటి ఫలితం రావటం ఎవ్వరికీ అంతుబట్టటం లేదు.
ముందుగానే చెప్పుకున్నట్టు, ఓపెనింగ్స్ సాధారణ స్థాయిలో వచ్చిన ఈ సినిమాకు కలెక్షన్ లు తరువాత పెరగక పోగా రోజు రోజుకూ తగ్గుతూ వచ్చాయి. ముఖ్యంగా తొలి మూడు రోజుల తరువాత మరీ దారుణంగా ఉన్న కలెక్షన్ ల వల్ల చాలా ధియేటర్ లు డే డెఫిసిట్ లు (అంటే కనీసం ధియేటర్ రెంట్ కూడా వసూలు అవ్వక పోవడం) చవి చూశాయి. ఇక ఈ గురువారం చాలా థియేటర్ ల నుండి అంటే సుందరానికీ సినిమాను తీసేస్తున్నారు అంటే ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యింది అనేది అర్థం అవుతుంది.