టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు సినిమాలతో ఇటు రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పార్టీ యొక్క కార్యకలాపాలతో కొనసాగుతున్న పవన్ మరోవైపు మూడు సినిమాలు చేస్తున్నారు.
అందులో ఒకటి సుజిత్ తీస్తున్న ఓజీ కాగా మరొకటి క్రిష్, జ్యోతి కృష్ణ తీస్తున్న హరిహర వీరమల్లు వేరొకటి హరీష్ శంకర్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూడు సినిమాలపై పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. ఆ విధంగా బిజీగా కొనసాగుతున్న పవన్ ఈ మూడు సినిమాలుకు సంబంధించి చాలా వరకు షూటింగ్ పూర్తి చేశారు. త్వరలో వీటి యొక్క మిగిలిన షూట్ ని ఆయన పూర్తి చేయనున్నారు.
ముందుగా వీటిలో మేలో హరిహర వీర మల్లు మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. అనంతరం ఓజి, ఆపైన ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కానున్నాయి. ఇక ఇటీవల ఒక తమిళ్ ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను సినిమాలు పూర్తిగా వదిలేయడం లేదని అయితే తనకు డబ్బులు అవసరమైన ప్రతి సమయంలో సినిమాలు చేస్తానని, మరీ ముఖ్యంగా రాజకీయాల పైన అలానే ప్రజలకు సేవ చేయటం పైనే తన యొక్క దృష్టి కేంద్రీకృతమై ఉంటుందని చెప్పుకొచ్చారు పవన్.
దీనిని బట్టి పవన్ ఇకపై ఇటు రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా కొనసాగుతారనేది అర్థమవుతుంది. అలానే పవన్ కెరీర్ లైనప్ పరంగా చూస్తే ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాల అనంతరం మరొక రెండు సినిమాలు ఆయన లైనప్ లో ఉన్నాయని అంటున్నారు. అందులో ఒకటి సురేందర్ రెడ్డి మూవీతో పాటు మరొక్కసారి తన స్నేహితుడు త్రివిక్రమ్ తో కూడా పవన్ ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో మూవీ చేసేందుకు సిద్దమవుతున్న త్రివిక్రమ్, అనంతరం పవన్ తో మూవీ చేయనున్నట్లు టాక్. త్వరలో వీటికి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయట