పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ తీసిన భారీ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కల్కి 2898 ఏడి ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా దాని అనంతరం ప్రస్తుతం మారుతీ తో ది రాజా సాబ్ మూవీ చేస్తున్న ప్రభాస్, అతి త్వరలో సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్, హను రాఘవపూడి మూవీస్ షూట్ లో పాల్గొననున్నారు.
ఈ మూడు మూవీస్ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. కాగా వీటిలో తాజాగా గ్రాండ్ గా లాంచ్ అయిన హను రాఘవపూడి మూవీ 1940ల కాలం నాటి పీరియాడికల్ లవ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ మూవీలో పాకిస్థానీ నటి ఇమ్రాన్ ఇస్మాయిల్ హీరోయిన్ గా నటించనుంది.
విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీని మేకర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. విషయం ఏమిటంటే, ఈమూవీలో మరొక ఫారిన్ నటి నటించనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. కాగా ఈ మూవీలో పాకిస్థానీ మోడల్ సజల్ ఆలీ కూడా రెండో హీరోయిన్ గా ఎంపికయ్యారని, సినిమాలో ఆమె పాత్ర కూడా ఎంతో కీలకమైందని అంటున్నారు. త్వరలో ఆమెకు సంబందించి మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.