Homeసినిమా వార్తలుటాలీవుడ్ ను నిరాశపరిచిన ఈ వారం సినిమాలు

టాలీవుడ్ ను నిరాశపరిచిన ఈ వారం సినిమాలు

- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమకు ఆగస్టు నెల బాగా కలిసివచ్చింది. వరుస విజయాలు కలిగిన ఆ నెల తర్వాత, సెప్టెంబర్ పరిశ్రమకు చాలా కఠినమైన నెలగా మారింది. రంగ రంగ వైభవంగా, ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ద‌గ్గ‌ర దారుణంగా పరాజయం పాలవడంతో ఈ నెల ప్రారంభం అయింది. ఈ రెండు సినిమాలు కూడా తొలిరోజునే కుదేలయ్యాయి. కాగా ఆ సినిమాలకు సంభందించిన అన్ని పార్టీలకు కూడా అన్ని రకాలుగా నష్టాలను మిగిల్చి భారీ డిజాస్టర్లుగా నిలిచాయి.

ఆ తర్వాత వారంలో వచ్చిన ఓకే ఒక జీవితం సినిమా రూపంలో మరో మంచి సినిమా వచ్చింది, సరైన కంటెంట్ ఎల్లప్పుడూ ప్రేక్షకుల మనసును గెలుస్తుందని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. ఒకే ఒక జీవితం హృద్యమైన సినిమాగా ప్రశంసలు దక్కించుకోవటంతో పాటు బాక్సాఫీస్ వద్ద.కూడా భారీ విజయాన్ని సాధించింది. అమ్మ సెంటిమెంట్ ప్రధాన కథగా.. దానికి టైం ట్రావెల్ వంటి విభిన్న అంశాన్ని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే ఆ తర్వాత కథ మళ్లీ మొదటికి వచ్చింది..గత వారం విడుదలైన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. నేను మీకు బాగా కావాల్సినవాడిని అనే రెండు సినిమాల రూపంలో అట్టర్ డిజాస్టర్లు పరిశ్రమను మళ్ళీ వెనక్కి తోశాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీసు వద్ద నామ మాత్రపు షేర్లని నమోదు చేసి ఎగ్జిబిటర్లకు పెద్ద మొత్తంలోనే నష్టాలను మిగిల్చాయి.

READ  పూరీ జగన్నాథ్ ఇచ్చే నష్టపరిహారంతో సంతోషంగా లేని లైగర్ డిస్ట్రిబ్యూటర్లు

ఇక తాజాగా ఈ వారం విడుదలైన సినిమాల పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఈ వారం విడుదలైన మూడు సినిమాలు కూడా కనీస స్థాయిలో థియేటర్లలో ప్రేక్షకులను రప్పించడంలో ఘోరంగా విఫలమయ్యాయి. అంతే కాకుండా చాలా చోట్ల తొలి రోజునే థియేటర్ రెంట్ ను వసూలు చేయడంలో కూడా విఫలమయ్యాయి.

శ్రీవిష్ణు నటించిన అల్లూరి సినిమా ఒక మోస్తరు స్థాయిలో సమీక్షలను తెచ్చుకుంది. ఇక నాగ శౌర్య హీరోగా వచ్చిన కృష్ణా వ్రిందా విహారి కూడా అంతే. కాకపోతే ఈ వారంలో విడుదలైన సినిమాలలో కంటెంట్ పరంగా బాగుందన్న పేరు మాత్రం ఈ సినిమాకు మిగిలింది. ఇక దొంగలున్నారు జాగర్త సినిమా అయితే ఆ సినిమా రిలీజ్ అయిన సంగతి చాలా మందికి తెలియనే తెలియదు. అంత ఘోరంగా ఆ సినిమా పరాజయం పాలయింది.

ఈ మూడు సినిమాలు మూకుమ్మడిగా ఢమాల్ అవడంతో దాదాపు అన్ని థియేటర్లు ఇప్పుడు డెఫిసిట్లలో నడుస్తున్నాయి. కాగా ఎగ్జిబిటర్లు దసరా పండుగ సందర్భంగా విడుదల అయ్యే సినిమాలు మళ్ళీ తమ వ్యాపారం ఊపందుకునేలా చేస్తాయని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ సినిమా


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories