యువ హీరో నితిన్, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆగస్టు 12 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో నితిన్ కలెక్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక మరింత అంచనాలను పెంచడానికి అందాల భామ అంజలిని రంగంలోకి దింపారు చిత్ర బృందం.. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో అంజలి ప్రేక్షకులకు కనువిందు చేయనుందని అధికారికంగా ప్రకటిస్తూ అంజలి ఉన్న ఇది వరకే పోస్టర్ ను రిలీజ్ చేశారు.
అంజలికి ఇలాంటి ఐటెం సాంగ్స్ కొత్తేమి కాదు. చిలకలూరి చింతామణి అంటూ సరైనోడు చిత్రంలో బన్నీ సరసన ఆడిపాడి మెప్పించిన సంగతి తెలిసిందే. అప్పట్లో బ్లాక్ బస్టర్ పాట ఎంత పెద్ద హిట్ అయిందో, ఎంతటి సంచలనాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చెప్పినట్టుగానే, ఈరోజు మాచర్ల నియోజకవర్గం చిత్ర యూనిట్ ‘రా రా రెడ్డి… నేను రెడీ’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ‘మాస్ రెడ్డి ఊర మాస్ జాతర షురూ’ అనే టాగ్ లైన్ ను కూడా జత చేశారు.ఈ పాటలో నితిన్ తో కలిసి అంజలి అదిరిపోయే స్టెప్పులు వేసారు. ఊర మాస్ నేపధ్యంలో ఉన్న ఈ పాటలో, నితిన్ తొలి చిత్రం “జయం” లోని సూపర్ హిట్ పాట “రాను రానంటూనే చిన్నదో” పాట లైన్ మధ్యలో రావటం విశేషం. ఖచ్చితంగా ఇది థియేటర్లలో ప్రేక్షకులకి ఊపు తెస్తుంది.
‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. నితిన్ తో ఆయనకు ఇది మూడో చిత్రం ఇంతకు ముందు ‘భీష్మ’, ‘మాస్ట్రో’ సినిమాలకు పని చేశారు. ఇప్పుడీ ‘రా రా రెడ్డి… మాస్ జాతర రెడీ’ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యంగా అందించగా, గాయని లిప్సిక పాడారు.