బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ ఆనిమల్. గతేడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇండియా వైడ్ బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద సంచలన విజయం సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద రూ. 950 కోట్ల వరకు కలెక్షన్ సొంతం చేసుకుంది.
ఇక ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగా. ఈమూవీ అనంతరం ఆనిమల్ కి సీక్వెల్ అయిన ఆనిమల్ పార్క్ మూవీ చేయనున్నారు సందీప్. దీని పై అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కోసం అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
విషయం ఏమిటంటే ఆనిమల్ మూవీకి సెకండ్ పార్ట్ అయిన ఆనిమల్ పార్క్ మాత్రమే కాదు, ఆపైన మరొక పార్ట్ కూడా ఉందని, తాజాగా సందీప్ తనకు ఈ విషయమై స్క్రిప్ట్ చెప్పారని అన్నారు నటుడు రణబీర్ కపూర్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా రణబీర్ చేసిన ఈ వ్యాఖ్యలతో మొత్తంగా అందరిలో రానున్న ఆనిమల్ సిరీస్ మూవీ పై అంతకంతకు ఆసక్తి ఏర్పడుతోంది.