Home సినిమా వార్తలు Animal bags IIFA Awards in Many Categories ‘​ఆనిమల్’ కు ఐఫా అవార్డుల పంట 

Animal bags IIFA Awards in Many Categories ‘​ఆనిమల్’ కు ఐఫా అవార్డుల పంట 

animal

బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ ఆనిమల్. గత ఏడాది డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ అందరినీ ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 

ఈ మూవీలో అనిల్ కపూర్, పృథ్వీరాజ్, శక్తి కపూర్, బాబీ డియోల్ వంటి వారు కీలక పాత్రలు పోషించగా భద్రకాళి ఫిలిమ్స్, టి సిరీస్ ఫిలిమ్స్, సినీ వన్ స్టూడియోస్ సంస్థలు దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించాయి. అయితే విషయం ఏమిటంటే, తాజాగా జరిగిన 2024 ఐఫా అవార్డుల ఈవెంట్ లో ఆనిమల్ మూవీకి అనేక కేటగిరీల్లో పలు అవార్డులు దక్కడం విశేషం. 

ఇక ఈ మూవీ బెస్ట్ పిక్చర్ గా అలానే సపోర్టింగ్ రోల్ మేల్ గా అనిల్ కపూర్, నెగటివ్ రోల్ లో బాబీ డియోల్ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇక ఈ మూవీకి సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితో పాటు బీజీఎమ్ అందించిన హర్షవర్షన్ రామేశ్వర్, ప్లే బ్యాక్ సింగర్ భూపిందర్ బబ్బల్ కూడా అవార్డులు దక్కించుకున్నారు. అలానే బెస్ట్ ఎడిటర్ గా సందీప్ రెడ్డి వంగా, బెస్ట్ సౌండ్ డిజైనర్స్ గా సచిన్ సుధాకర్, హరిహరన్, బెస్ట్ లిరిసిస్ట్ గా సిద్దార్థ గరిమ ఈ మూవీకి గాను అవార్డులు సొంతం చేసుకున్నారు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version