Home సినిమా వార్తలు Suma Son: హీరోగా పరిచయం అవుతున్న యాంకర్ సుమ కనకాల తనయుడు

Suma Son: హీరోగా పరిచయం అవుతున్న యాంకర్ సుమ కనకాల తనయుడు

ప్రముఖ యాంకర్ సుమ కనకాల తనయుడు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా పరిచయం అవుతున్నారు. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవికాంత్ పేరెపు దర్శకత్వంలో మహేశ్వరి మూవీస్ పతాకం పై ఈ కొత్త చిత్రం రూపొందుతోంది. ప్ర

ముఖ యాంకర్ సుమ కనకాల మరియు నటుడు రాజీవ్ కనకాల కుమారుడైన రోషన్ కనకాల తొలిసారి ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను పి.విమల చూసుకుంటున్నారు.

రోషన్ కనకాల బర్త్ డే సందర్భంగా డీజేగా వైబ్రెంట్ అవతారంలో ఉన్న పోస్టర్ ను చిత్ర బృందం ఇటీవలే విడుదల చేసింది. ఈ పోస్టర్లో రోషన్ కర్లీ హెయిర్, సన్ గ్లాసెస్ ధరించి, హెడ్సెట్ ధరించి డీజే సిస్టమ్లో మ్యూజిక్ ప్లే చేస్తున్నారు.

ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా కొత్తతరం రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతుండగా, శ్రీచరణ్ పాకాల సంగీతం, నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవికాంత్ పేరెపుతో పాటు విష్ణు కొండూరు, శేరి-గన్ని ఇతర రచయితలు కాగా, వంశీకృష్ణ స్క్రీన్ ప్లేకు కన్సల్టెంట్ గా వ్యవహరిస్తున్నారు. శివంరావు ప్రొడక్షన్ డిజైన్ మేనేజర్.

తీసిన కొన్ని సినిమాలతోనే తనకంటూ ప్రత్యేకమైన టేకింగ్, న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీలకు పెట్టింది పేరైన రవికాంత్ పేరెపు నుంచి వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత గానో ఎదురుచూస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version