తొలి తెలుగు ఓటీటీ సంస్థ ఆహా తనదైన కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు ఇండియన్ ఐడల్, మరియు బాలకృష్ణ తో అన్స్టాపబుల్ వంటి ప్రోగ్రాంలతో వీక్షకులను అలరించిన ఆహా.. ఇప్పుడు మరో కొత్త కథ తో అందరి ముందుకి వస్తుంది.
ఆహాలో ”హైవే” అనే సినిమా త్వరలో ప్రసారం కాబోతుంది. ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రధారులుగా, కే వి గగన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆహా స్క్రీన్స్ మీద రాబోతుంది.కథ విషయానికి వస్తే ఫోటోగ్రాఫర్ విష్ణు (ఆనంద్ దేవరకొండ), తులసి (మానస) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. సాఫీగా సాగిపోతున్న వారి ప్రేమ కథలో, ఒక సీరియల్ కిల్లర్ ‘డి’ అనే పేరుతో ప్రవేశిస్తాడు. ఇంతకీ ఆ సైకో కిల్లర్ ఎవరు? విష్ణు అతన్ని ఎలా ఎదుర్కున్నాడు ? వంటి ప్రశ్నలకు సినిమా చూస్తేనే సమాధానం తెలుస్తోంది.
ఈ సినిమా ప్రేక్షకులను రెప్ప వేయనివ్వని థ్రిల్లర్ గా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీల పాత్రలు చాలా కొత్తగా ఉండబోతున్నాయి అని సమాచారం. ఈ సినిమా పోస్టర్ ను ఆహా ఇటీవలే ఆవిష్కరించింది.
ప్రేక్షకుల చేత ఆహా అనిపించేలా తమ పనితీరు ఉండేలా ఆహా యాప్ యూనిట్ వినూత్నమైన ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకు నిదర్శనమే ”కలర్ ఫోటో”. 68 నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ రీజినల్ ఫిలిం గా అవార్డు గెలుచుకుని అందరి ప్రశంసలు అందుకుంది. అలాంటి ఆహా ఇప్పుడు ”హైవే” సినిమా తో మరోసారి అందరి ఆదరణను పొందడానికి సిద్ధమవుతుంది.
విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా ఆనంద్ దేవరకొండ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు యువ హీరో ఆనంద్ దేవరకొండ. పుష్పక విమానం వంటి విభిన్న కథనంతో వచ్చిన సినిమాతో ప్రేక్షకులని ఆకట్టుకున్న ఆనంద్.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న ఆనంద్ అందులో ఒకటి గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థలో చేయనుండటం విశేషం.
ఆ సినిమా పేరు ‘బేబీ’. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై SKN, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.