Homeసినిమా వార్తలుప్రభాస్ - మారుతి సినిమా కోసం ఒక పాత ధియేటర్ సెట్

ప్రభాస్ – మారుతి సినిమా కోసం ఒక పాత ధియేటర్ సెట్

- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు మారుతితో కలిసి ఒక కామెడీ ఎంటర్‌టైనర్ కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి భారీ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేసింది.

కొత్త షెడ్యూల్ కోసం, చిత్ర బృందం హైదరాబాద్ శివార్లలో పాత సినిమా థియేటర్‌ను సిద్ధం చేసింది. ఈ థియేటర్‌లో హీరో, హీరోయిన్లు, ఇతర తారాగణంతో సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

ఈ చిత్రంలో కథానాయికలుగా మాళవిక మోహనన్ మరియు నిధి అగర్వాల్‌లు ఇప్పటికే ఎంపికయ్యారు. కాగా ఇటీవల, రాధే శ్యామ్‌లో ప్రభాస్‌తో కలిసి నటించిన రిద్ధి కుమార్ ఇతర ప్రధాన మహిళా పాత్రలో నటించారు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం, ప్రభాస్ మార్కెట్ దృష్ట్యా, నిర్మాతలు ఈ చిత్రాన్ని విస్తృత స్థాయిలో చిత్రీకరించాలని మరియు ఇతర భాషలలో కూడా ఉపశీర్షికను వేయాలని సన్నాహలు చేస్తున్నారట.

అన్నీ కుదిరితే ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. భారీ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన టిజి విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిభొట్ల నిర్మాణ భాధ్యత వహిస్తున్నారు.

ఈ నెల రెండో వారంలో జరగనున్న ఈ కొత్త షెడ్యూల్ కోసం ప్రభాస్ సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి రాజా డీలక్స్ అనే టైటిల్‌ని చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

READ  రాజకీయ కార్యక్రమంగా మారుతున్న బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షో

ఆదిపురుష్, సాలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లిస్ట్ లో మారుతితో సినిమా అనుకోకుండా ప్రభాస్ ఒప్పుకున్నారు . సీరియస్ సినిమాల మధ్య ఒక పక్కా యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ చేయాలనేది ప్రభాస్ ఆలోచనగా కనిపిస్తోంది. మరి అతని నిర్ణయం సరైనదే అని నిరూపించేలా దర్శకుడు మారుతి ప్రభాస్‌తో ఒక బ్లాక్‌బస్టర్‌ను అందిస్తాడని మనం కోరుకుందాం.

Follow on Google News Follow on Whatsapp

READ  RC 15: 15 కోట్ల భారీ బడ్జెట్ తో ఒక పాటను తెరకెక్కించనున్న శంకర్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories