Homeసినిమా వార్తలునితిన్ కు డాన్స్ రాదు.. నేనే నేర్పించా: అమ్మ రాజశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు

నితిన్ కు డాన్స్ రాదు.. నేనే నేర్పించా: అమ్మ రాజశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు

- Advertisement -

కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన అమ్మ రాజశేఖర్.. ఆ పైన దర్శకుడిగా కూడా రాణించారు. తెలుగులో అమ్మ రాజశేఖర్.. రణం, ఖతర్నాక్, టక్కరి లాంటి చిత్రాలు తెరకెక్కించారు. వీటిలో మొదటి చిత్రం రణం సూపర్ హిట్ అవగా, మిగిలిన చిత్రాలు మాత్రం డిజాస్టర్లు గా నిలిచాయి.

ప్రస్తుతం అమ్మ రాజశేఖర్ తెరకెక్కించిన ‘హయ్-ఫైవ్’ అనే సినిమా త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ చిత్రానికి అమ్మ రాజశేఖర్ దర్శకుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. అయితే ఈ ఈవెంట్ లో అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ హీరో నితిన్ పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. నితిన్ ని ఏకంగా ఒరేయ్ నితిన్ అని సంభోదిస్తూ ఊహించని విధంగా అమ్మ రాజశేఖర్ విమర్శలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో నితిన్ టక్కరి చిత్రంలో నటించారు. ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉండగా హై ఫైవ్ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ వేదికపై అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నితిన్ ని పది రోజుల ముందే ఇన్వైట్ చేశానని, అందుకు నితిన్ వస్తానని మాట కూడా ఇచ్చినట్టు తెలిపారు. కానీ మాట మీద నిలబడకుండా నితిన్ ఫంక్షన్ కు రాలేదని, గురువు లాంటి తనను నితిన్ మరచిపోయాడని అమ్మ రాజశేఖర్ వాపోయారు.

READ  గాార్గి ట్రైలర్: మరో ఆసక్తికరమైన కథతో రాబోతున్న సాయి పల్లవి

కెరీర్ లో మనం ఎదిగినందుకు సహాయపడ్డవారిని మరచిపోకూడదు. కానీ నితిన్ నన్ను మరచిపోయాడు. నితిన్ కి డ్యాన్స్ రాదు. తనకు నేనే డ్యాన్స్ నేర్పించి ఒక స్థాయికి వచ్చేలా చేశానని అమ్మ రాజశేఖర్ చెప్పడం గమనార్హం. నా ఫస్ట్ ప్రొడక్షన్ లో వస్తున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నితిన్ రాలేదు. నితిన్ ప్రస్తుతం బిజీగా కూడా లేడు. ఇంట్లో ఉండి కూడా రాలేదు. ఫంక్షన్ కు రాకపోయినా పర్వాలేదు కనీసం వీడియో బైట్ ఇవ్వమని అడగగా అది కూడా చేయలేదని.. నితిన్ కి మర్యాద కూడా తెలియదు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇక చివరిగా కేవలం నితిన్ నే కాకుండా అందరినీ ఉద్దేశిస్తూ అమ్మ రాజశేఖర్.. మనం ఎంత ఎదిగినా అందుకు కారణమైన వారిని మరిచిపోకూడదు అని చెప్పారు. ఏదైనా సహాయం కోరి పిలిస్తే, వస్తే వస్తానని చెప్పాలి లేదా రానని చెప్పాలి కానీ ఇలా చేయడం తనను ఎంతో బాధకు గురి చేసిందని చెప్తూ అమ్మ రాజశేఖర్ వేదిక పై భావోద్వేగానికి గురై ఏడ్చేశారు. మరి ఈ వ్యాఖ్యలు ఇంతటితో ఆగుతాయా లేక మళ్ళీ నితిన్ ఏమైనా వివరణ ఇస్తారా అనేది చూడాలి.

READ  రికార్డు స్థాయిలో జరగనున్న అఖిల్ ఏజెంట్ ప్రి రిలీజ్ బిజినెస్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories