భారతీయ సినిమా షహెన్‌షాగా ఎనలేని ఖ్యాతిని పొందిన అమితాబ్ బచ్చన్ మరియు దక్షిణ భారత సినిమా సంచలన నటి మరియు ప్రస్తుత జాతీయ క్రష్, రష్మిక మందన్న గుడ్‌బై అనే ఫ్యామిలీ కామెడీ డ్రామాలో కలిసి నటించారు. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వికాస్ బహ్ల్ ఈ ప్రతిభావంతులైన నటీనటులను ఓకే ఫ్రేమ్‌లో తీసుకువచ్చారు.
అయితే అమితాబ్ బచ్చన్ మరియు రష్మిక మందన్న ల ఆసక్తికరమైన కలయిక అయినప్పటికీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయారు. గుడ్‌బై మూవీ థియేట్రికల్ రిలీజ్‌లో దారుణంగా విఫలమైంది మరియు ఇప్పుడు OTTలో విడుదలకి సిద్ధంగా ఉంది. డిసెంబర్ 2న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. హిందీలో మనోహరమైన రష్మిక అరంగేట్రం కోసం ఈ సినిమాని ప్రేక్షకులు చూడవచ్చు.
అక్టోబర్ 7న విడుదలైన ఈ చిత్రం పేలవమైన సమీక్షలకు తెరతీసింది మరియు ఈ సంవత్సరం పెద్ద హిందీ చిత్రాలలో ఓపెనింగ్స్ మరియు కలెక్షన్లు బలహీనంగా ఉన్న సంగతి తెలిసిందే. అదే కోవలో ఈ చిత్రానికి కూడా కనీస ప్రభావితమైన విధంగా కూడా కలెక్షన్లు రాలేదు.
ఈ చిత్రంలో నీనా గుప్తా సునీల్ గ్రోవర్, పావైల్ గులాటి, ఆశిష్ విద్యార్థి, ఎల్లి అవ్రామ్‌లు వంటి ప్రతిభావంతమైన నటీనటులు ఇతర సహాయక పాత్రల్లో నటించారు.
సమీక్షకుల అభిప్రాయం ప్రకారం, ఈ చిత్రంలో కామెడీ మరియు సెంటిమెంట్ వంటి రెండు జోనర్‌ల మిశ్రమంగా ప్రయత్నించిన, అవి బాగా మిళితం కాలేదు మరియు చిత్రం చివరిలో ఉండాల్సిన భావోద్వేగమైన అనుభూతిని కోల్పోయింది.
గుడ్‌బై సినిమా కథ విషయానికి వస్తే.. భల్లా కుటుంబం వారి ఇంట్లో అనుకొని విషాదం నెలకొంటుంది. మరి వారు ఆ సందర్భంగా ఎదురయ్య సవాళ్లతో పోరాడే శక్తిని తిరిగి ఎలా పొందారు అనేదే కథ. సినిమా కొన్నిసార్లు ఫన్నీగా ఉంటుంది మరియు సెంటిమెంట్ కూడా కొన్ని చోట్ల పని చేసింది, కానీ ఈ అంశాలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించే విధంగా మాత్రం సరిపోలేదు.