కోలీవుడ్ యువ నటుడు శివకార్తికేయన్ హీరోగా యువ సక్సెస్ఫుల్ అందాల నటి సాయి పల్లవి హీరోయిన్ గా రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ బయోగ్రఫికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అమరన్. ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా భువన్ అరోరా, రాహుల్ బోస్, లల్లూ, శ్రీకుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీలో మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో అద్భుతంగా నటించగా ఆయన సతీమణి ఇంధు రెబెక్కా వర్గీస్ గా సాయి పల్లవి తన మార్వలెస్ పెరఫార్మన్స్ తో అందరినీ అలరించారు. ఇక ఈ మూవీ తెలుగులో కూడా మంచి కలెక్షన్ అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ఇప్పటికే అమరన్ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్ల గ్రాస్ ని దాటేసింది. కాగా కేవలం మూడురోజుల్లోనే మొత్తంగా ఈ మూవీ రూ. 106 కోట్లని రాబట్టింది.
ఈరోజుతో ఈ మూవీ శివ కార్తికేయన్ డాన్ ఓవరాల్ కలెక్షన్ అయిన రూ. 120 కోట్లని దాటేసే అవకాశం కనపడుతోంది. అలానే మొత్తంగా అమరన్ రూ. 200 కోట్ల గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంటుందని తెలుస్తోంది. అమరన్ హిట్ తో శివ కార్తికేయన్ నటుడిగా మరింత మంచి క్రేజ్ అందుకోవడంతో పాటు సాయి పల్లవికి కూడా మరింత బాగా పేరు లభించింది.