కోలీవుడ్ స్టార్ నటుడు శివ కార్తికేయన్ హీరోగా అందాల నటి సాయి పల్లవి హీరోయిన్ గా రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా యాక్షన్ బేస్డ్ బయోగ్రాఫికల్ ఎంటర్టైనర్ మూవీ అమరన్. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాని రాజ్ కమల్ ఇంటర్నేషనల్, సోనీ ఫిలిమ్స్ ఇండియా సంస్థలు గ్రాండ్ లెవెల్ లో నిర్మించాయి.
ఇటీవల తమిళతో పాటు తెలుగు భాషలో కూడా ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ స్థాయిలో సక్సెస్ సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటికే రూ. 330 కోట్లని దాటి ఓవరాల్ గా కలెక్షన్ అయితే సొంతం చేసుకుని ఇంకా బాక్సాఫిస్ వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా అమరన్ అటు తమిళనాడులో కూడా భారీ స్థాయిలో కలెక్షన్ సొంతం చేసుకుంటోంది.
ఇక ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. విషయం ఏమిటంటే తాజాగా అమరన్ మూవీ డిసెంబర్ 5న తమ ఓటిటి మధ్యమంలో పలు భాషల్లో రిలీజ్ అవుతుందని తాజాగా నెట్ ఫ్లిక్స్ వారు అనౌన్స్ చేశారు. మరి థియేటర్స్ లో అందరిని ఆకట్టుకున్న ఈ మూవీ నెట్ పిక్స్ లో ఏ స్థాయిలో ఆడియన్స్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.