ప్రస్తుతం కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన పేట్రియాటిక్ ఎంటర్టైనర్ మూవీ అమరన్. ఈ బయోలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో శివ కార్తికేయన్ తోపాటు సాయి పల్లవి ఇద్దరు పాత్రలు అలానే వారి నటనకు ఆడియన్స్ నుండి విశేషమైన క్రేజ్ లభిస్తుంది. ఫస్ట్ డే నుండి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తో అమరన్ మూవీ కొనసాగుతోంది. ముఖ్యంగా తమిళనాడుతో పాటు తెలుగులో కూడా అమరన్ కి మంచి కలెక్షన్స్ లభిస్తున్నాయి.
ఓపెనింగ్స్ పరంగా తెలుగులో కూడా అదరగొడుతున్న ఈ మూవీ రెండు రోజులకు బాగానే కలెక్షన్ రాబట్టింది. ఈ మూవీ రెండవ రోజు రూ. 34 కోట్లు రాబట్టి మొత్తంగా రెండు రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 70 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక రేపటితో ఈ మూవీ రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసే అవకాశం గట్టిగా కనపడుతోంది.
ప్రస్తుతం వస్తున్న కలెక్షన్, ఆడియన్స్ రెస్పాన్స్ ని బట్టి చూస్తుంటే ఫుల్ రన్ లో అమరన్ మూవీ రూ. 200 కోట్ల మార్క్ గ్రాస్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అంటున్నాయి సినీ వర్గాలు. ఇక ఇటు తెలుగులో ఈ మూవీ రూ. 25 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. కాగా అన్ని చోట్ల తమ మూవీ బాగా పెర్ఫార్మ్ చేస్తుండడంతో అమరన్ టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.