ప్రముఖ కోలీవుడ్ స్టార్ నటుడు శివ కార్తికేయన్ హీరోగా స్టార్ నటి సాయి పల్లవి హీరోయిన్ గా రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ బయోగ్రాఫికల్ ఎంటర్టైనర్ మూవీ అమరన్. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ అలానే సోనీ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా సంస్థలు గ్రాండ్ లెవెల్ లో నిర్మించాయి.
ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం అన్ని భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ సంపాదించుకుని బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది తెలుగులో కూడా అదరగొట్టే రేంజిలో కలెక్షన్ రాబడుతోంది అమరన్. ఇక ఈ రెస్పాన్స్ తో అమరన్ మూవీ ఈ ఏడాది కోలీవుడ్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే విషయం ఏమిటంటే తాజాగా ఈ మూవీ ఇలయదళపతి విజయ్ హీరోగా నటించిన GOAT మూవీ యొక్క రికార్డును బద్దలు కొట్టింది.
అదేమిటంటే GOAT మూవీ మొత్తంగా 4.5 ఐదు మిలియన్ల టిక్కెట్లు బుక్ మై షో లో అమ్ముడవ్వగా తాజాగా దానిని అధిగమించి నేడు కోలీవుడ్ టాప్ వన్ మూవీగా నిలిచింది అమరన్. మరోవైపు అమరన్ తమిళనాడులో కూడా భారీ స్థాయి కలెక్షన్ తో కొనసాగుతోంది. ఓవరాల్ గా ఈ మూవీ రూ. 300 కోట్ల మార్కు చేరుకునే అవకాశం కనబడుతోంది. ఈ మూవీతో హీరోగా శివ కార్తికేయన్ భారీ స్థాయి ఇమేజ్ తో పాటు మరింత మార్కెట్ అయితే సొంతం చేసుకున్నారు.