కోలీవుడ్ ఇవ్వనటుడు శివ కార్తికేయన్ తాజాగా యువ దర్శకుడు రాజకుమార్ పెరియసామి దర్శకత్వంలో తరకెక్కిన బయోగ్రాఫికల్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ అమరన్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సోనీ పిక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థలపై గ్రాండ్ లెవెల్ లో నిర్మితమైన అమరన్ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఆడియన్స్ ముందుకు వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ ని సంపాదించుకుంది.
ఇక ఈ సినిమాని దివంగత సైనిక అమరవీరుడు వరదరాజన్ ముకుందన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఇక ఈ మూవీకి కొన్ని కమర్షియల్ హంగులను జోడించి తెరకెక్కించారు దర్శకుడు రాజకుమార్ పెరియసామి. ఈ సినిమా ఇప్పటికే ఓవరాల్ గా రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుని శివ కార్తికేయన్ కెరీర్ లోనే ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కాగా ఈ సినిమాతో ఆయన తమిళనాడులోని టాప్ స్టార్స్ లీగ్ లో చేరారు. అమరన్ మూవీ యొక్క ఏరియా వైజ్ 12 రోజుల కలెక్షన్ డీటెయిల్స్ చూద్దాం.
- తమిళనాడు – రూ. 123 కోట్లు
- తెలుగు రాష్ట్రాలు – రూ. 32 కోట్లు
- కర్ణాటక – రూ. 17 కోట్లు
- కేరళ – రూ. 11 కోట్లు
- టోటల్ ఇండియా – రూ. 183 కోట్లు
గ్రాస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా అటు ఓవర్సీస్ లో రూ. 71.5 కోట్లను సొంతం చేసుకుంది. మొత్తంగా 12 రోజుల్లో అమరన్ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 254 కోట్ల కలెక్షన్ రాబట్టి రూ. 300 కోట్ల క్లబ్ దిశగా కొనసాగుతోంది. ఈ సినిమాతో నటుడుగా శివ కార్తికేయన్ భారీ క్రేజ్ తో పాటు మార్కెట్ ని కూడా అందుకున్నారు.