Homeసినిమా వార్తలుఈ వారం OTT లో విడుదల కానున్న సినిమాలు

ఈ వారం OTT లో విడుదల కానున్న సినిమాలు

- Advertisement -

శుక్రవారం అంటేనే సినిమా ప్రేమికులకు అత్యంత ఇష్టమైన రోజు. ఆ రోజు అటు థియేటర్ల వద్ద కొత్త సినిమాల సందడి ఉంటుంది కాబట్టి. ఐతే ఇప్పుడు థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయా అని ఎదురు చూడటం ప్రేక్షకులకి అలవాటుగా మారింది. ఇక గత కొన్ని రోజులుగా ఒకటి రెండు సినిమాలు లేదా అంతకు మించిన సినిమాలు ప్రతి వారం ప్రేక్షకులని పలకరిస్తూనే ఉన్నాయి. అలాగే ఈ వారం తెలుగు బాక్సాఫీస్ వద్ద కూడా మూడు సినిమాలు రాబోతున్నాయి. అందులో థియేటర్ కు వెళ్లి చూడాల్సినవి అయితే.. ఇంకొన్ని ఓటీటీ లో సినిమాలు చూడాల్సినవి.

ఈ క్రమంలోనే శుక్రవారం ఓటీటీ లో కొత్తగా పలు సినిమా లు స్ట్రీమింగ్ కు సిద్ధం అయ్యాయి. అందులో మొదటిది ఎనర్జటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన ది వారియర్ కాగా.. రెండో చిత్రం నాగ చైతన్య నటించి థాంక్యూ.. ఈ రెండు సినిమాలు ఈ వారంలోనే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ది వారియర్, థాంక్యూ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలను ధియేటర్లో చూడలేని ప్రేక్షకులు ఓటీటీ లో మాత్రం తప్పకుండా చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక థాంక్యూ సినిమా గూర్చి అక్కినేని అభిమానులు ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

READ  మెగాస్టార్ తో తలపడనున్న మంచు విష్ణు

ది వారియర్ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో స్ట్రీమింగ్ కాబడుతోంది. ఇక థాంక్యూ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ రెండు సినిమాలు కాకుండా తెలుగు ప్రేక్షకుల కోసం మరి కొన్ని సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి. అవి కూడా ఈ శుక్రవారం నుండి అందుబాటులోకి రాబోతున్నాయి.

సాయి పల్లవి నటించిన గార్గి సినిమా కూడా.ఈ వారమే సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సాయి పల్లవి కి ఉన్న స్టార్ డం వల్ల గార్గి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక మలయాళంలో ఫాహాద్ ఫాజీల్ నటించి మెప్పించిన అయిన మాలిక్ సినిమాను ఆహా యాప్ లో ఈ వారం తెలుగులో డబ్ చేసి స్ట్రీమింగ్ చేస్తున్నారు.

ఈ శుక్రవారం నుంచే మాలిక్ తెలుగు లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే విజయ్ సేతుపతి నటించిన తమిళ సినిమా మాన్మనిథాన్ ను మహా మనిషి అనే టైటిల్ తో ఆహా లో ఈ శుక్రవారం స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మొత్తానికి ఈ వారం లో ఓటీటీ లో సినిమాల సందడి భారీ స్థాయిలోనే ఉంటుంది. అందువల్ల ఈ వారాంతం ప్రేక్షకులు హాయిగా తమ చేతివేళ్ల దగ్గరే జనరంజకమైన ఆనందాన్ని పొందవచ్చు.

Follow on Google News Follow on Whatsapp

READ  దిల్ రాజుకు అచ్చిరాని బాలీవుడ్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories